News February 5, 2025
నేడు కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

TG: BC కులగణన, SC వర్గీకరణ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష BRS విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై కాంగ్రెస్ సర్కారు వివరణ ఇవ్వనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో క్యాబినెట్ సబ్ కమిటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనుంది. స్పీకర్ ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్, బీసీ, ఎస్సీ సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 7, 2025
గుడ్లను ఇలా ఉడికిస్తున్నారా?

గుడ్డులో పోషకాలు, రంగు, రుచి ప్రత్యేకంగా ఉండాలంటే ఓ పద్ధతి ప్రకారం ఉడికించాలని US శాస్త్రవేత్తలు తెలిపారు. గుడ్డు సరిగ్గా ఉడకాలంటే ముందుగా మరుగుతున్న నీటిలో నుంచి గోరు వెచ్చని నీటిలోకి.. అలాగే గోరు వెచ్చని నీటిలో నుంచి మరుగుతున్న నీటిలోకి ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మార్చాలి. ఇలా 32 నిమిషాలపాటు చేయాలి. ఆ తర్వాత చల్లని నీటిలో ఉంచి పెంకు తీయాలి. ఇలా చేస్తే గుడ్డులోని పోషకాలు సమతుల్యంగా లభిస్తాయి.
News February 7, 2025
కాలేజీలో నాపై ఎంతోమందికి క్రష్: రష్మిక

కళాశాలలో చాలామందికి తనపై క్రష్ ఉండేదని నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలిపారు. ఆ తర్వాత దేశం మొత్తానికి క్రష్‌గా మారానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘కిరిక్ పార్టీ(కన్నడ) సినిమా తర్వాత నేషనల్ క్రష్ ట్యాగ్ వచ్చింది. ఈ ట్యాగ్ దేశం మొత్తం పాకిపోయింది. ప్రస్తుతం దేశ ప్రజలందరూ నన్ను ప్రేమిస్తున్నారు. ఇది నాకు చాలా ప్రత్యేకంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. రష్మిక కాలి గాయంతో బాధపడుతూ రెస్ట్ తీసుకుంటున్నారు.
News February 7, 2025
ఆదాయం ప్రకటించిన ఎల్‌ఐసీ

LIC ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.11,506 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతంతో పోలిస్తే 17 శాతం పెరిగినట్లు పేర్కొంది. ప్రీమియంల ద్వారా రూ.1,06,891 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ త్రైమాసికంలో మెుత్తంగా సంస్థ ఆదాయం రూ.2,01,994 కోట్లు కాగా గతంతో పోలిస్తే రూ.10,453 కోట్లు తగ్గినట్లు ప్రకటించింది. ఈ నష్టాలతోLIC షేరు 2.15శాతం తగ్గి రూ.811 వద్ద ముగిసింది.