News May 24, 2024

6 నెలల్లోనే కాంగ్రెస్ మోసాలు బట్టబయలు: హరీశ్ రావు

image

TG: అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కాంగ్రెస్ మోసాలు బట్టబయలయ్యాయని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. ఆ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు చూస్తున్నారని చెప్పారు. ‘రాష్ట్రంలోని మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులను కాంగ్రెస్ నిలువునా మోసగించింది. గ్యారంటీలు అమలు చేయలేక చేతులెత్తేసింది. ఎన్నికల హామీలను ఆ పార్టీ తుంగలో తొక్కుతోంది. రేవంత్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి’ అని ఆయన విమర్శించారు.

Similar News

News January 28, 2026

T-మున్సి‘పోల్స్’.. రంగంలోకి BJP అగ్రనేతలు!

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా BJP రాష్ట్ర నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, హోం మంత్రి అమిత్ షాను ప్రచారానికి రావాలని ఆహ్వానించారు. FEB 2,3న మహబూబ్‌నగర్‌లో నితిన్ నబీన్, 8,9 తేదీల్లో నిర్మల్‌లో అమిత్‌షా సభ నిర్వహించాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారని తెలుస్తోంది. అగ్ర నేతల పర్యటనపై 2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

News January 28, 2026

రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదు

image

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదైంది. <<18445119>>హిందువుల<<>> మనోభావాలు దెబ్బతీశారని ఓ లాయర్ బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొన్ని నెలల క్రితం కాంతార చాప్టర్-1 మూవీ ఈవెంట్‌లో రణ్‌వీర్ దైవానికి సంబంధించిన సన్నివేశాన్ని ఇమిటేట్ చేసి కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News January 28, 2026

ట్రంప్ వార్నింగ్.. ఇరాన్ దీటైన జవాబు

image

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ వైపు మరో యుద్ధనౌక దూసుకొస్తోందని బెదిరిస్తూనే, వారు న్యూక్లియర్ డీల్ చేసుకుంటారని భావిస్తున్నానని ట్రంప్ పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడి బెదిరింపులకు ఇరాన్ బదులిచ్చింది. తమపై యూఎస్ దాడులు చేస్తే మునుపెన్నడూ లేనంతగా దీటైన జవాబిస్తామని స్పష్టం చేసింది. అమెరికా తమతో చర్చలకు వస్తే అంగీకరిస్తామని, మిలిటరీ చర్యలకు దిగాలని చూస్తే సహించబోమని హెచ్చరించింది.