News December 16, 2024
కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ!
‘INDIA’లో ఐక్యతకు బీటలు వారుతున్నాయి. కాంగ్రెస్, రాహుల్‌పై మిత్రపక్షాలు విశ్వాసం కోల్పోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మొన్నటి వరకు నాయకత్వం మమతకు విడిచిపెట్టాలని డిమాండ్ చేశాయని, ఇప్పుడు EVMలపై ఆ పార్టీ వైఖరిని ఖండిస్తున్నాయని పేర్కొంటున్నారు. ఓటింగ్ యంత్రాలపై ఇకనైనా నసుగుడు ఆపాలని JK CM <<14888698>>ఒమర్<<>> అబ్దుల్లా అనడాన్ని ఉదహరిస్తున్నాయి. కాంగ్రెస్‌పై మిత్రపక్షాల విమర్శలు చేటు చేస్తాయనడంపై మీ కామెంట్.
Similar News
News January 24, 2025
Richest TV Star.. ఆస్తి రూ.5200 కోట్లు
ఆయన నటించరు. కనీసం పాడరు. డాన్సూ చేయరు. అయినా దశాబ్దకాలంగా హయ్యెస్ట్ పెయిడ్ టీవీ స్టార్‌గా గుర్తింపు పొందారు. ఏడాదికి రూ.650CR సంపాదిస్తారు. ఇప్పుడాయన నెట్‌వర్త్ ఏకంగా రూ.5200 కోట్లు. ఆయనే మ్యూజిక్ ఎగ్జిక్యూటివ్, ప్రొడ్యూసర్, రియాల్టి షోస్ జడ్జి సైమన్ కోవెల్. The X Factor, Britain’s Got Talent, American Idol, America’s Got Talentకు జడ్జి. వీటితో పాటు Syco కంపెనీ ద్వారా ఆయనకు ఆదాయం వస్తుంది.
News January 24, 2025
విజయసాయి రెడ్డి.. ఇది ధర్మమా?: బండ్ల గణేశ్
రాజకీయాల నుంచి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తప్పుకోవడంపై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పందించారు. ‘అధికారం ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్లిపోవడం చాలా మంది రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయింది. ఇది ధర్మమా!’ అని ట్వీట్ చేశారు.
News January 24, 2025
కౌశిక్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ వార్నింగ్
TG: తీరు మార్చుకోకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. యువ రాజకీయ నాయకుడికి అంత ఆవేశం పనికిరాదని మంత్రి హితవు పలికారు. తమ ఇద్దరికి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని ఉత్తమ్ సూచించారు.