News February 8, 2025

ఆప్‌కు కాంగ్రెస్ ‘ఓట్ షేరింగ్’ దెబ్బ

image

ఢిల్లీ ఎన్నికలు ఫలితాలు ఆప్‌కు అధికారాన్ని దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి దక్కాల్సిన ఓట్లను కాంగ్రెస్ పార్టీ దారుణంగా చీల్చడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఆప్ ప్రస్తుతం 15% ఓట్లు కోల్పోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4.26 % ఓట్లు రాగా, ప్రస్తుతం 17% ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. ఆప్‌కు దక్కాల్సిన మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ ఎగరేసుకుపోయింది.

Similar News

News February 8, 2025

మనీశ్ సిసోడియా ఓటమి

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఓడిపోయారు. జంగ్‌పుర నుంచి పోటీ చేసిన ఆయనపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు.

News February 8, 2025

వెలువడుతున్న ఫలితాలు.. బీజేపీ 4, ఆప్ 1

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు లీడింగ్‌లో కొనసాగిన BJP, AAP విజయాలు నమోదు చేస్తున్నాయి. BJP 4 చోట్ల విజయం సాధించగా AAP ఒకచోట గెలుపొందింది. మరో 42స్థానాల్లో కమలదళం, 23చోట్ల ‘చీపురు’ పార్టీ లీడింగ్‌లో కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఆప్ 26 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కేజ్రీవాల్, ఆతిశీ, సిసోడియా వెనుక పడిపోవడంతో ఆధిక్యం 23కు తగ్గింది. అగ్రనేతలే ఆ పార్టీకి భారం కావడం గమనార్హం.

News February 8, 2025

1000 వికెట్లు సాధించడమే నా లక్ష్యం: రషీద్ ఖాన్

image

టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు(461 మ్యాచుల్లో 633 వికెట్లు) తీసిన అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ 1000 వికెట్ల మార్కును లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘1000 వికెట్లు దక్కించుకోవడమనేది నమ్మశక్యం కాని అద్భుతమైన ఘనత. ఫిట్‌గా ఉండి, ఇప్పుడు ఆడుతున్న స్థాయిలోనే ఆడితే మరో మూడు, నాలుగేళ్లలో కచ్చితంగా తీస్తా. 4అంకెల వికెట్లు అనేది బౌలర్ ఊహకు మాత్రమే సాధ్యం’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!