News February 8, 2025

ఆప్‌కు కాంగ్రెస్ ‘ఓట్ షేరింగ్’ దెబ్బ

image

ఢిల్లీ ఎన్నికలు ఫలితాలు ఆప్‌కు అధికారాన్ని దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి దక్కాల్సిన ఓట్లను కాంగ్రెస్ పార్టీ దారుణంగా చీల్చడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఆప్ ప్రస్తుతం 15% ఓట్లు కోల్పోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4.26 % ఓట్లు రాగా, ప్రస్తుతం 17% ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. ఆప్‌కు దక్కాల్సిన మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ ఎగరేసుకుపోయింది.

Similar News

News March 20, 2025

అధికారం వచ్చాక నిరుద్యోగుల గొంతునొక్కారు: కేటీఆర్

image

TG: ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాపై కాంగ్రెస్ ఉక్కుపాదం మోపిందని కేటీఆర్ విమర్శించారు. తాజా బడ్జెట్‌ను ఉద్దేశించి రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదని దుయ్యబట్టారు. అధికారం కోసం అశోక్ నగర్ వెళ్లి, తీరా అధికారం వచ్చాక నిరుద్యోగుల గొంతునొక్కారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే అరెస్టులు, దాడులు చేస్తున్నారని, కాంగ్రెస్ అరాచక పాలన రాహుల్ గాంధీకి కనిపించట్లేదా అని నిలదీశారు.

News March 20, 2025

రోజూ డబ్బు ఇస్తేనే భార్య కాపురం చేస్తానంటోంది: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

image

రోజూ రూ.5,000 ఇస్తేనే భార్య తనతో కాపురం చేస్తానంటోందని బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించాడు. WFH జూమ్ కాల్స్ వేళ భార్య కొట్టేదని, ల్యాప్‌టాప్ ముందు డాన్స్ కూడా చేయడంతో జాబ్ పోయిందని తెలిపాడు. 60 ఏళ్లు వచ్చే వరకు పిల్లలు వద్దంటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. విడాకులు అడిగితే రూ.45లక్షలు డిమాండ్ చేస్తోందన్నాడు. అయితే మరో పెళ్లి కోసమే భర్త ఇలా ఆరోపిస్తున్నాడని భార్య చెబుతోంది.

News March 20, 2025

చంద్రబాబుతో భేటీపై బిల్‌గేట్స్ ట్వీట్

image

మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నిన్న భేటీ అయి పలు ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై బిల్‌గేట్స్ ట్వీట్ చేశారు. ‘బిల్‌గేట్స్ ఫౌండేషన్‌ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు సీఎం చంద్రబాబును కలవడం సంతోషం. వైద్యం, వ్యవసాయం, విద్యలో ఆవిష్కరణల ఆధారిత వృద్ధికి రాష్ట్రానికి మద్దతునిస్తూ వారితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!