News November 29, 2024
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ

మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో ఓటమిపై ఢిల్లీలో నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. EVMలపై అభ్యంతరాలను కూడా చర్చించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపైనా చర్చించనున్నారు. ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల నుంచి దామోదర, వంశీచంద్, రఘువీరా, కొప్పులరాజు, సుబ్బరామిరెడ్డి, గిడుగు రుద్రరాజు, పళ్లంరాజు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు భేటీ జరగనుంది.
Similar News
News November 28, 2025
స్వరాష్ట్రంలో తొలిసారి భద్రాచలం పంచాయతీ ఎన్నికలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం గ్రామ పంచాయతీకి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. 2014 తర్వాత ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. జిల్లాలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న భద్రాచలంలో మొత్తం 40,761 ఓట్లు ఉన్నాయి. ఇందులో మహిళా ఓటర్లు 21,136, పురుష ఓటర్లు 19,634, ఇతర ఓటరు 1 గా నమోదయ్యారు. ఇక్కడ మొదటి విడతలో పోలింగ్ జరుగుతుంది.
News November 28, 2025
మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.
News November 28, 2025
ఎన్నికల వేళ రౌడీషీటర్లపై కన్నేయండి: జిల్లా ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా పెంచాలని కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. గురువారం నేర సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మట్కా, బెట్టింగ్, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, శక్తి టీమ్స్ పనితీరు మెరుగుపరచాలని సూచించారు. రోడ్డు భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.


