News November 29, 2024
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ
మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో ఓటమిపై ఢిల్లీలో నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. EVMలపై అభ్యంతరాలను కూడా చర్చించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపైనా చర్చించనున్నారు. ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల నుంచి దామోదర, వంశీచంద్, రఘువీరా, కొప్పులరాజు, సుబ్బరామిరెడ్డి, గిడుగు రుద్రరాజు, పళ్లంరాజు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు భేటీ జరగనుంది.
Similar News
News December 8, 2024
నిద్ర పోయేటప్పుడు ఇలా చేస్తున్నారా?
పడుకునే సమయంలో చాలా మంది దోమల బెడదను తప్పించుకునేందుకు దోమల నివారణ యంత్రాలను వాడుతారు. వీటిని వాడటం వల్ల హానికరమైన రసాయనాలు వెలువడుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. దీంతో శ్వాస, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇవి కాస్త క్యాన్సర్కు దారితీసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కర్పూరం పొగ, వేపాకులను కాల్చడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.
News December 8, 2024
ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి: సీఎం చంద్రబాబు
AP: భారీ వర్షాలతో ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జేసీలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కోత కోసిన వరిని వెంటనే సమీపంలోని రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. కోత కోసిన వరిని రక్షించేందుకు టార్పాలిన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు వర్షాలు పడే సమయంలో పంట కోత కోయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
News December 8, 2024
రాముడే సిగ్గుతో తలదించుకుంటాడు: ఇల్తిజా
రాముడి పేరు నినదించలేదన్న కారణంతో ముస్లిం యువకులను హింసించడం లాంటి ఘటనలతో రాముడే సిగ్గుతో తలదించుకుంటాడని PDP నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ ఇలాంటి సమయాల్లో రాముడు సైతం నిస్సహాయంగా ఉండిపోతారని పేర్కొన్నారు. దేవుడి పేరును చెడగొడుతూ లక్షలాది మంది భారతీయులను పట్టిపీడిస్తున్న రోగం హిందుత్వమని అన్నారు.