News August 7, 2024

లండ‌న్ కేంద్రంగా కుట్ర!

image

షేక్ హసీనా ప్ర‌భుత్వాన్ని కూలదోసి భార‌త వ్య‌తిరేక భావాలున్న ఖలీదా జియాను గద్దెనెక్కించడానికి లండ‌న్ కేంద్రంగా కుట్ర జ‌రిగిన‌ట్టు బంగ్లా ఇంటెలిజెన్స్ ఆధారాలు సేక‌రించింది. జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ఇటీవ‌ల ఐఎస్ఐ వ‌ర్గాల‌తో సౌదీ అరేబియాలో భేటీ అయిన‌ట్టు స‌మాచారం. త‌దుప‌రి లండ‌న్ కేంద్రంగా ప‌క్కా వ్యూహం అమ‌లు చేసిన‌ట్టు నిఘా వ‌ర్గాలు తేల్చాయి.

Similar News

News March 27, 2026

ఎండలు.. శరీరానికి డబుల్ షాక్!

image

సమ్మర్‌లో ఉద్యోగులపై డబుల్ ఎఫెక్ట్ పడుతుందని హెల్త్ ఎక్స్‌పర్టులు చెబుతున్నారు. ‘మధ్యాహ్నం బయటికెళ్తే హీట్ ఎక్కువ వస్తుంది. అక్కడి నుంచి ఆఫీసులోకొస్తే చాలా కూల్‌గా ఉంటుంది. ఈ సడెన్ మార్పులతో తలనొప్పి, కళ్లలో మంట, చర్మం పొడిబారడం వంటివి కనిపిస్తాయి. BP పెరగొచ్చు. అందుకే ఎండ నుంచి నేరుగా చల్లటి చోటుకు వెళ్లొద్దు. AC 24–26°C ఉండాలి. దాని ఎదురుగా కూర్చోవద్దు. నీరు ఎక్కువ తాగాలి’ అని అంటున్నారు.

News March 27, 2026

RCBvsSRH: కీలక ప్లేయర్ దూరం

image

IPL: SRHతో రేపు ఆరంభ మ్యాచ్ జరగనుండగా RCBకి మరో షాక్ తగిలింది. ఈ హైఓల్టేజ్ మ్యాచులో హేజిల్‌వుడ్ ఆడట్లేదని కోచ్ ఆండీ ఫ్లవర్ తెలిపారు. హీల్ ఇంజ్యూరీతో అతను గత OCT నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నట్లు చెప్పారు. నిన్న RCB క్యాంపులో చేరి ప్రాక్టీస్ చేస్తున్నా ఫిట్‌నెస్ సాధించలేదన్నారు. దీంతో RCB బౌలింగ్ భారం సీనియర్ బౌలర్ భువీపై పడనుంది. ఇప్పటికే నువాన్ తుషార, యశ్ దయాల్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.

News March 27, 2026

పీరియడ్స్ ఆలస్యం.. ‘మార్చి’ని నిందిస్తున్న అమ్మాయిలు!

image

ఈ నెలలో తమ పీరియడ్స్ <<19484301>>ఆలస్యం<<>> అవుతున్నాయని, ‘మార్చి మంచిది కాదు’ అంటూ కొంతమంది అమ్మాయిలు SMలో పోస్టులు పెడుతున్నారు. కానీ అదంతా అపోహేనని వైద్యులు చెబుతున్నారు. FEBలో 28 రోజులే ఉండటం, MARలో వాతావరణం, సూర్యరశ్మిలో మార్పు వంటి సైంటిఫిక్ రీజన్స్ హార్మోన్ల విడుదలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. MARలోనే పరీక్షలు, రొటీన్ జాబ్ షిఫ్టుల స్ట్రెస్, ట్రావెల్ షెడ్యూల్సూ ఆలస్యానికి కారణమట.