News August 7, 2024
లండన్ కేంద్రంగా కుట్ర!
షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి భారత వ్యతిరేక భావాలున్న ఖలీదా జియాను గద్దెనెక్కించడానికి లండన్ కేంద్రంగా కుట్ర జరిగినట్టు బంగ్లా ఇంటెలిజెన్స్ ఆధారాలు సేకరించింది. జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ఇటీవల ఐఎస్ఐ వర్గాలతో సౌదీ అరేబియాలో భేటీ అయినట్టు సమాచారం. తదుపరి లండన్ కేంద్రంగా పక్కా వ్యూహం అమలు చేసినట్టు నిఘా వర్గాలు తేల్చాయి.
Similar News
News September 12, 2024
బంగ్లాతో తొలి టెస్టుకు భారత్ తుది జట్టు ఇదే?
ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టు ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీమ్ ఇండియా తుది జట్టు ఇలా ఉంటుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. జట్టు: రోహిత్ శర్మ (C), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్.
News September 12, 2024
సెప్టెంబర్ 12: చరిత్రలో ఈ రోజు
1686: మొఘల్ సామ్రాజ్యంలో బీజాపూరు రాజ్యం విలీనం
1925: ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జోలెపాళ్యం మంగమ్మ జననం
1967: నటి అమల అక్కినేని జననం
1997: నటి శాన్వీ మేఘన జననం
2009: హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం
2009: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రాజ్‌సింగ్ దుంగార్పూర్ మరణం
2010: సింగర్ స్వర్ణలత మరణం
News September 12, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.