News December 3, 2024
కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, కరాటే, వాలీబాల్, షూటింగ్ సహా 27 విభాగాల్లో జాతీయ/అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం లేదా విజయం సాధించిన వారు అర్హులు. 18-23 ఏళ్లలోపు వయసున్న టెన్త్ పాసైన వారు DEC 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ.21,709-69,100 జీతం చెల్లిస్తారు. వివరాలకు ఇక్కడ <
Similar News
News January 21, 2025
ఎంపీల కారు అలవెన్సుగా నెలకు రూ.లక్ష
AP: రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల కార్లకు అలవెన్సుల కింద నెలకు రూ.లక్ష చొప్పున మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మంత్రులకు మినహా మిగతా ఎంపీలకు ఈ అలవెన్స్ వర్తించనుంది. అలాగే డిప్యూటీ స్పీకర్, ఆర్థిక మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్‌కు గృహోపకరణాల కొనుగోలుకు ఒకసారి గ్రాంటుగా రూ.1.50లక్షల చొప్పున రూ.4.50 లక్షలు మంజూరు చేస్తూ మరో ఉత్తర్వును సర్కారు జారీ చేసింది.
News January 21, 2025
కుంభమేళాలో 12లక్షల తాత్కాలిక ఉద్యోగాలు!
ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాలో 12లక్షల తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరిగిందని గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ NLB సర్వీసెస్ అంచనా వేసింది. పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనే సుమారు 4.5లక్షల మందికి ఉపాధి లభించవచ్చని తెలిపింది. హోటల్ స్టాఫ్, టూర్ గైడ్, పోర్టర్లు, ట్రావెల్ కన్సల్టెంట్లు, ఈవెంట్ కోఆర్డినేటర్లు, రవాణా, వైద్య శిబిరాల్లో లక్షల మందికి పని దొరికిందని చెప్పింది.
News January 21, 2025
కింగ్ రిటర్న్ అయ్యారు: ఎలన్ మస్క్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం స్వీకారం చేసిన వేళ టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఆసక్తికర ట్వీట్ చేశారు. నిబంధనలు అతిక్రమించినందుకు ట్రంప్ అకౌంట్‌ను గతంలో ట్విటర్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. ఆనాటి, ప్రస్తుతం ఆయన పేరు పక్కన యాడ్ అయిన అధ్యక్షుడు అనే అక్షరాలు కనిపించేలా ‘కింగ్ రిటర్న్ అయ్యారు’ అంటూ పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ కీలకంగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.