News August 21, 2025

ఫేక్ సర్టిఫికెట్లతో కానిస్టేబుల్ ఉద్యోగాలు!

image

TG: పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో నకిలీ సర్టిఫికెట్లతో 50 మందికి పైగా సెలక్ట్ అయినట్లు అధికారులు గుర్తించారు. 2022 నోటిఫికేషన్‌లో HYD పరిధిలో స్థానికతను చూపించేందుకు తప్పుడు బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించారని తెలిపారు. మొత్తం 59 మందిలో 54 మంది సెలక్ట్ అయ్యారని, వారిపై సీసీఎస్‌లో కేసు నమోదు చేశామన్నారు. అభ్యర్థుల ప్రొబెషన్‌ను నిలిపివేసి, తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

Similar News

News August 21, 2025

JANలో ‘దేవర-2’ షూట్.. ఆ తర్వాతే వేరే మూవీ!

image

‘దేవర-2’ సినిమా అటకెక్కిందని వస్తోన్న ప్రచారం ఫేక్ అని సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు వెల్లడించాయి. అన్నీ కుదిరితే జనవరి నుంచి షూట్ మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారని, ఇది పూర్తయ్యాకే మిగతా సినిమాలపై దృష్టి పెడతారని చెప్పాయి. కాగా ‘దేవర-2’ 2027 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News August 21, 2025

వినాయక చవితి.. పోలీసుల సూచనలు

image

వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ పేర్కొంది. <>ఆన్‌లైన్‌లోనే<<>> వీటికి అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ‘విద్యుత్ కనెక్షన్ కోసం DD కట్టండి. నిపుణుల సాయం లేకుండా విద్యుత్ కనెక్షన్ ఇవ్వకండి. గాలి, వానను తట్టుకునేలా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. పార్కింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేయండి. అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారమివ్వండి’ అని ట్వీట్ చేసింది. SHARE IT

News August 21, 2025

GSTలో రెండు శ్లాబులకు మంత్రుల బృందం ఓకే

image

GSTలో <<17416480>>రెండు శ్లాబుల<<>> ప్రతిపాదనను మంత్రుల బృందం ఆమోదించింది. ప్రస్తుతం జీఎస్టీలో 4 శ్లాబులు ఉండగా వాటిని రెండుకు (5%, 18%) కుదిస్తూ ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ మంత్రుల బృందానికి ప్రతిపాదన పంపింది. దీనికి జీఎస్టీ మండలి కూడా ఆమోదం తెలిపితే రెండు శ్లాబుల విధానం దేశమంతటా అమలులోకి వస్తుంది. కొత్త విధానంలో 12%, 28% శ్లాబ్స్ ఉండవు. దీనివల్ల ఆటోమొబైల్, నిత్యావసరాల ధరలు భారీగా తగ్గనున్నాయి.