News January 23, 2025
కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులో అపశ్రుతి.. అభ్యర్థి మృతి

AP: విశాఖపట్నంలో కానిస్టేబుల్ అభ్యర్థుల ఫిజికల్ టెస్టులో అపశ్రుతి చోటు చేసుకుంది. 1600 మీటర్ల రన్నింగ్ సమయంలో అభ్యర్థి శ్రావణ్ కుమార్ కుప్పకూలాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మరణించాడు. పోలీసు అవుతాడనుకున్న కొడుకు పుట్టినరోజునే మృతి చెందటంతో శ్రావణ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Similar News
News January 20, 2026
కొనసాగుతున్న టారిఫ్ల ఎఫెక్ట్.. నష్టాల్లో మార్కెట్లు

ట్రంప్ టారిఫ్ల ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఇంకా కొనసాగుతోంది. సెన్సెక్స్ 270 పాయింట్లు నష్టపోయి 82,975 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 76 పాయింట్లు కుంగి 25,509 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో SBI, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా, NTPC షేర్లు లాభాల్లో.. ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, ఇండిగో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.93 వద్ద ప్రారంభమైంది.
News January 20, 2026
నోబెల్ విజేతను మేం ఎంపిక చేయలేదు: నార్వే PM

8 యుద్ధాలను ఆపినా నోబెల్ బహుమతి దక్కలేదని, ఇక శాంతి గురించి <<18900406>>ఆలోచించనని<<>> నార్వే PMకు ట్రంప్ లేఖ రాయడం తెలిసిందే. ఈ క్రమంలో నోబెల్ విజేతల ఎంపికలో ప్రభుత్వం పాత్ర లేదని నార్వే PM జోనాస్ స్టోయిర్ బదులిచ్చారు. బహుమతిని స్వతంత్ర నోబెల్ కమిటీ ప్రకటించిందని, నార్వే ప్రభుత్వం కాదని ఓ ప్రకటనలో తెలిపారు. గ్రీన్లాండ్ విషయంలో తమపై విధించిన టారిఫ్స్ను వ్యతిరేకిస్తూ ట్రంప్ను కాంటాక్ట్ అయ్యానని చెప్పారు.
News January 20, 2026
ఏకైక ప్లేయర్గా జకోవిచ్ రికార్డు

ఆస్ట్రేలియన్ ఓపెన్(టెన్నిస్)లో తొలి రౌండ్లో గెలుపుతో 100 విజయాలు పూర్తి చేసుకున్న జకోవిచ్ అరుదైన ఘనత సాధించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్(సింథటిక్)తో పాటు వింబుల్డన్(గ్రాస్), ఫ్రెంచ్ ఓపెన్(మట్టి).. మూడు గ్రాండ్ స్లామ్ ఈవెంట్లలో 100 చొప్పున మ్యాచులు గెలిచిన ఏకైక ప్లేయర్గా నిలిచారు. ఈ టోర్నీలో టైటిల్ గెలిస్తే 25 మేజర్ ట్రోఫీలు నెగ్గిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కనున్నారు.


