News January 23, 2025

కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులో అపశ్రుతి.. అభ్యర్థి మృతి

image

AP: విశాఖపట్నంలో కానిస్టేబుల్ అభ్యర్థుల ఫిజికల్ టెస్టులో అపశ్రుతి చోటు చేసుకుంది. 1600 మీటర్ల రన్నింగ్ సమయంలో అభ్యర్థి శ్రావణ్ కుమార్ కుప్పకూలాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మరణించాడు. పోలీసు అవుతాడనుకున్న కొడుకు పుట్టినరోజునే మృతి చెందటంతో శ్రావణ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Similar News

News February 7, 2025

Stock Markets: ఫ్లాటుగా సూచీలు.. లాభాల్లో మెటల్ స్టాక్స్

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, RBI వడ్డీరేట్ల సమీక్ష నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ 23,586 (-17), సెన్సెక్స్ 78,035 (-22) వద్ద చలిస్తున్నాయి. FMCG, IT, O&G, మీడియా సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, మెటల్ స్టాక్స్ పుంజుకున్నాయి. ఎయిర్‌టెల్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, JSW స్టీల్, అల్ట్రాటెక్ సెమ్ టాప్ గెయినర్స్.

News February 7, 2025

నేడు వడ్డీ రేట్లు ప్రకటించనున్న ఆర్బీఐ

image

ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల్ని కాసేపట్లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించనున్నారు. కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెషన్ ఆరంభ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 87.80 పాయింట్లు పెరిగి 78,145.96 వద్ద ఉంది. నిఫ్టీ 35.05 పాయింట్లు లాభపడి 23,638 వద్ద ట్రేడయింది.

News February 7, 2025

వైద్యశాస్త్రంలో అరుదు.. మోచేతిపై పురుషాంగం

image

వైద్యశాస్త్రంలోని సంఘటనలు అప్పుడప్పుడు ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే HYDలో జరిగింది. సోమాలియాకు చెందిన యువకుడికి చిన్నప్పుడు సున్తీ కారణంగా ఇన్‌ఫెక్షన్ సోకి పురుషాంగం తొలగించారు. తిరిగి పొందేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరికి హైటెక్ సిటీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించాడు. వైద్యులు అతడి మోచేతిపై పురుషాంగాన్ని డెవలప్ చేసి, దాన్ని మర్మాంగాలు ఉండే ప్లేస్‌లో అమర్చారు.

error: Content is protected !!