News April 10, 2025
టెంపుల్ సిటీలో వేద పాఠశాల నిర్మాణం

TG: యాదాద్రి టెంపుల్ సిటీలో వేద పాఠశాల నిర్మాణానికి రూ.23.78 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అదే విధంగా 15 ఎకరాల స్థలం కేటాయించింది. సాంస్కృతిక పాఠశాలను సైతం టెంపుల్ సిటీలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి వేద పాఠశాల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం రాయగిరిలో వేద పాఠశాల నిర్మాణం చేపట్టాలని భావించగా సాధ్యపడలేదు.
Similar News
News February 10, 2026
మక్తల్: ఎన్నికల వేళ విషాదం.. BJP అభ్యర్థి ఆత్మహత్య

మక్తల్ పురపాలక ఎన్నికల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మహాదేవప్ప ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎన్నికల ప్రచారం ముగిసి, పోలింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News February 10, 2026
ఓటుకు రూ.30వేలు.. గెలిపిస్తే అర తులం బంగారం!

TG: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు భారీగా వెచ్చిస్తున్నట్లు సమాచారం. ORR సమీపంలోని మున్సిపాలిటీలలో ఓటుకు ఏకంగా రూ.10-30వేల చొప్పున ఇస్తున్నారని తెలుస్తోంది. చేవెళ్లలోని 16వ వార్డులో ఓ అభ్యర్థి గెలిస్తే అర తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చాడు. చాలా చోట్ల ఓటుకు రూ.3-5వేల వరకు పంచడమే కాకుండా చికెన్/మటన్, మందు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
News February 10, 2026
PF విత్‌డ్రాకు ప్రత్యేక యాప్

UPI ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో PF సొమ్ము డిపాజిట్ అయ్యేలా కొత్త యాప్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏప్రిల్‌లో ఇది అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉన్న UMANG యాప్‌నకు అదనంగా ఇది పనిచేస్తుంది. యాప్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే 3రోజుల్లోనే గరిష్ఠంగా ₹5లక్షల వరకు డిపాజిట్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం UPI ద్వారా PF విత్‌డ్రా చేసుకునే ఫీచర్ లేదు.


