News March 17, 2024
16 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

AP: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 16 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడించారు. ‘ఇండియా’ కూటమిలోని పార్టీలతో చర్చించిన అనంతరం అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. మంగళగిరిలో తమ పార్టీ కచ్చితంగా పోటీలో ఉంటుందని ప్రెస్మీట్లో చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీతో పాటు ఎన్డీఏ కూటమిలోని పార్టీలను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News April 5, 2025
ఈనెల 15న జపాన్కు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 15న జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 23 వరకు అక్కడే ఉంటారు. వెస్టర్న్ జపనీస్ సిటీ ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో ఆయనతో పాటు, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొననున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన ఉండనుంది.
News April 5, 2025
రెండో రోజూ భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గి సామాన్యుడికి కాస్త ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి నేడు ₹980 తగ్గి ₹90,660కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹900 తగ్గి ₹83,100గా పలుకుతోంది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ రూ.1,07,900కి చేరింది. కాగా, రెండ్రోజుల్లో తులం బంగారం రేటు రూ.2720 తగ్గడం విశేషం.
News April 5, 2025
మెగా డీఎస్సీపై BIG UPDATE!

AP: రాష్ట్రంలో మెగా DSC నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. SC వర్గీకరణ రోస్టర్ పాయింట్లపై గవర్నర్ ఆమోదంతో జారీ అయ్యే ఆర్డినెన్స్ ఆధారంగా టీచర్ పోస్టులు కేటాయిస్తారు. ఆ తర్వాతి రోజే నోటిఫికేషన్ ఇస్తారని సమాచారం. ముందుగా చెప్పినట్లే 16,347 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి, విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా ప్రక్రియ పూర్తి చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.