News March 17, 2024
16 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

AP: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 16 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడించారు. ‘ఇండియా’ కూటమిలోని పార్టీలతో చర్చించిన అనంతరం అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. మంగళగిరిలో తమ పార్టీ కచ్చితంగా పోటీలో ఉంటుందని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీతో పాటు ఎన్డీఏ కూటమిలోని పార్టీలను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News December 6, 2025
వెంకటపురం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచారం

జియ్యమ్మవలస మండలం వెంకటపురం పరిసర గ్రామాల్లో శనివారం ఏనుగుల గుంపు సంచారం చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. అరటి తోటల్లోకి చొచ్చుకెళ్లిన ఏనుగులు పంట నష్టం కలిగించినట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, రాత్రి వేళల్లో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
News December 6, 2025
గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

AP: విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తోన్న కృషిని CM వివరించినట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని నిర్మాణ పనుల పురోగతిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
News December 6, 2025
హిట్ మ్యాన్@ 20,000 రన్స్

SAతో మూడో వన్డేలో రోహిత్ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్(టెస్టు, వన్డే, T20)లో 20,000 పరుగులు చేసిన నాలుగో ఇండియన్ ప్లేయర్‌గా నిలిచారు. కేశవ్ వేసిన 14 ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి ఈ ఘనత సాధించారు. సచిన్(34,357), కోహ్లీ(27,910), ద్రవిడ్(24,064) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా ప్రస్తుత మ్యాచ్‌లో భారత్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో జైస్వాల్(38), రోహిత్(50) ఉన్నారు.


