News November 29, 2024

ఇదే బౌలింగ్ అటాక్ కొనసాగించండి: పుజారా

image

BGTలో ఆడిలైడ్ పింక్ బాల్ టెస్ట్‌కు సిద్ధమవుతోన్న టీమ్‌ఇండియాకు క్రికెటర్ పుజారా సలహా ఇచ్చారు. తొలి టెస్ట్‌లో సక్సెస్ అయిన బౌలింగ్ అటాక్‌నే కొనసాగించాలన్నారు. బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణాలనే మరోసారి ఎంపిక చేయాలని సూచించారు. బుమ్రా ప్రణాళికలను అమలు చేస్తూ వారిద్దరూ వికెట్లు సాధిస్తున్నట్లు చెప్పారు. అటు, KL రాహుల్‌ను టాప్ ఆర్డర్‌లో ఆడించాలని, ఓపెనర్‌గా లేదా వన్‌డౌన్‌‌లో పంపితే బాగుంటుందన్నారు.

Similar News

News February 12, 2026

బాల భీముడు.. 5.20KGల బరువుతో జననం

image

TG: సాధారణంగా నవజాత శిశువులు పుట్టగానే 2.5-3.5 కిలోల బరువుంటారు. కొన్నిచోట్ల 4 కేజీల బరువుతోనూ జన్మించారు. అయితే భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సంధ్యారాణి అనే మహిళ సీ సెక్షన్ ద్వారా 5.20 కేజీల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఈ బాల భీముడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

News February 12, 2026

కూరగాయ పంటల్లో తెగుళ్లు- కట్టడి సూచనలు

image

☛ అన్ని కూరగాయ పంటల్లో అక్షింతల పురుగు, చిత్తపురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 2మి.లీ కలిపి పిచికారీ చేయాలి. వంగ, కాకర, ఆగాకర పంటలకు మాత్రం లీటరు నీటికి థయోడికార్బ్ 1 గ్రాము కలిపి పిచికారీ చేసుకోవాలి.
☛ మిరప, టమాటా, క్యాబేజీ వంటి పంటల్లో ఎండుతెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా మెటాలాక్సిల్ + మాంకోజెబ్ 2గ్రా. కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి.

News February 12, 2026

హలో అనేందుకు మంత్రుల హడల్

image

తెలంగాణలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందన్న మంత్రి పొంగులేటి ఆరోపణ బాంబు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ టూల్స్‌తో BRS ట్యాప్ చేయిస్తుందేమోనని అనుమానిస్తున్న మంత్రులు నార్మల్ కాల్స్ ఆన్సర్ చేయడం లేదు. కొందరు మినిస్టర్స్ కొన్ని కాల్స్ అటెంప్ట్ చేసినా పైపై మాటలే. డీటెయిల్స్ జోలికి వెళ్లడం లేదు. ముఖ్య విషయాలు డిస్కస్ చేసేందుకు వాట్సాప్ కాల్ లేదా యాపిల్ ఫేస్ టైం వాడుతున్నారని సమాచారం.