News October 3, 2024
BHU విద్యార్థుల సస్పెన్షన్‌పై వివాదం
BHU IITలో గత ఏడాది విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్‌కి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన 13 మంది విద్యార్థులను సస్పెండ్ చేయడం వివాదాస్పదమైంది. బయటి వ్యక్తులను క్యాంపస్‌లోకి అనుమతించకూడదని విద్యార్థులు తాజాగా నిరసనకు దిగారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన వర్సిటీ విద్యార్థులను క్రమశిక్షణారాహిత్యం పేరుతో సస్పెండ్ చేసింది. గతంలో ఈ కేసులో ముగ్గురు BJP IT Cell సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
Similar News
News November 13, 2024
ఉల్లి ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే?
ఏడాదంతా దాదాపుగా స్థిరంగా ఉన్న ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశంలో అత్యధికంగా ఉల్లి ఉత్పత్తి చేసే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో రైతుల నుంచి సరఫరా తగ్గడమే దీనికి కారణంగా తెలుస్తోంది. రబీ సీజన్‌లోని పాత నిల్వ తక్కువగా ఉండడంతో కొత్త నిల్వ ఇంకా మార్కెట్లకు రాలేదు. ఈ సరఫరా-డిమాండ్‌లో వ్యత్యాసం కారణంగానే ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మరో 10 రోజుల్లో ధరలు దిగొస్తాయంటున్నారు.
News November 13, 2024
అమృత్ టెండర్లపై ఆరోపణలు అవాస్తవం: రేవంత్
TG: అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ BRS చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని CM రేవంత్ అన్నారు. ‘రెడ్డి పేరు ఉన్న వాళ్లంతా నా బంధువులు కారు. సృజన్ రెడ్డి BRS మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడు. ఆ పార్టీ హయాంలోనే సృజన్‌కు రూ.వేల కోట్ల పనులు ఇచ్చారు. ఈ టెండర్లలో అవినీతి జరగలేదని ఉపేందరే చెప్పారు. కేటీఆర్ ఎవరికైనా చెప్పుకోవచ్చు, కేసులు వేసుకోవచ్చు. నాకు ఇబ్బంది లేదు’ అని తెలిపారు.
News November 13, 2024
అక్కడ 14 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు!
దేశాలు, అక్కడి రూల్స్‌ను బట్టి వివాహం చేసుకునే వయస్సులో మార్పులుంటాయి. ఇండియాతో పాటు దాదాపు అన్ని దేశాల్లో వివాహం చేసుకోవాలంటే అబ్బాయికి 21, అమ్మాయికి 18 ఏళ్లు నిండాల్సిందే. అదే బొలీవియాలో WOMENకి 14, MENకి 16 ఏళ్లుంటే చాలు. చైనాలో Wకి 20 Mకి 22 ఏళ్లు. అఫ్గానిస్థాన్‌లో Wకి 16, Mకి 18గా ఉంది. యూరప్‌లోని అండోరాలో ఇద్దరికీ 16 ఏళ్లుండాలి. బహామాస్‌లో పేరెంట్స్ పర్మిషన్‌తో 15 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు.