News August 15, 2024
బెంగళూరులో పేలిన కుక్కర్.. NIA క్రాస్ ఎగ్జామినేషన్
బెంగళూరు జేపీ నగర్‌లోని ఉడుపి ఉపాహార్ రెస్టారెంట్ సమీపంలో కుక్కర్ పేలి ఒకరు మృతి చెందిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఈ ఘటనలో ఉగ్రకోణం లేదని పోలీసులు స్పష్టం చేసినా ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఇటీవల రామేశ్వరం కేఫెలో ఉగ్రవాదులు ఐఈడీ బాంబులతో పేలుళ్లకు కుట్రపన్నిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనపై NIA క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.
Similar News
News September 15, 2024
రిటైర్మెంట్‌పై స్టార్ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు
తన ఆటను మెరుగుపరుచుకోలేదని భావించినప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. ఆటకు వీడ్కోలు పలకడం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోలేదని, దీంతో ఆటపై ప్రేమను కోల్పోదలుచుకోలేదన్నారు.
News September 15, 2024
స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు కొరత రాకుండా చూస్తాం: శ్రీనివాస వర్మ
AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తి నిలిచిపోయిన విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు ఇలాంటి సమస్య కొత్తగా వచ్చినది కాదని వ్యాఖ్యానించారు. బొగ్గు కొరత రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వరదలతో నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుంటుందని చెప్పారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు.
News September 15, 2024
ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. టాటానగర్-పట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోగఢ్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా మార్గాల్లో ప్రయాణించే రైళ్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. వాస్తవానికి ఝార్ఖండ్‌లో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.