News October 30, 2024
కార్పొరేట్ నయా ట్రెండ్.. ‘సైలెంట్ ఫైరింగ్’!
కార్పొరేట్ సెక్టార్‌లో పొమ్మనలేక పొగబెట్టడం తరహాలో ఉద్యోగుల సైలెంట్ ఫైరింగ్ మొదలైనట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది. ఉద్యోగులకు కఠిన టాస్కులు ఇవ్వడం, WFH తొలగించడంతో చాలా మంది జాబ్స్‌కు గుడ్ బై చెప్పేలా చేస్తున్నారంది. ఆ స్థానాలను AIతో భర్తీ చేస్తారని పేర్కొంది. అయితే మనుషులు చేసే అన్ని టాస్క్‌లను AI చేయలేదని, వచ్చే పదేళ్లలో 5% ఉద్యోగాలనే AI భర్తీ చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Similar News
News November 18, 2024
మణిపుర్ కేసులు స్వీకరించిన NIA
మణిపుర్‌లో హింసకు కారణమైన మూడు కీలక కేసుల దర్యాప్తు బాధ్యతను NIA స్వీకరించింది. జిరిబమ్‌లో CRPF, కుకీ మిలిటెంట్ల మధ్య కాల్పులు, ఒకే కుటుంబంలోని ఆరుగురిని కిడ్నాప్ చేయడం, వారిని చంపేసిన కేసులను రాష్ట్ర పోలీసులు ఆ సంస్థకు బదిలీ చేశారు. మణిపుర్‌లో హింసకు దారితీసిన పరిస్థితులు, శాంతి భద్రతల ప్రభావంపై NIA దర్యాప్తు చేయనుంది. పరిస్థితుల నియంత్రణకు కేంద్రం మరో 2వేల CAPF అధికారులను మోహరిస్తోంది.
News November 18, 2024
మోదీ మాజీ భద్రతా సిబ్బందికి బిగ్‌బాస్ ఆఫర్.. ట్విస్ట్ ఇచ్చిన EX ఏజెంట్
PM మోదీ EX భద్రతా సిబ్బంది లక్కీ బిష్త్‌కు బిగ్‌బాస్-18లో ఛాన్స్ దక్కింది. అయితే, ఆయన ఈ అవకాశాన్ని తిరస్కరించినట్టు తెలిసింది. EX స్నైపర్, RAW ఏజెంట్‌గా పనిచేసిన ఆయన సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. RAW ఏజెంట్‌గా తమ జీవితాలు ఎప్పుడూ గోప్యంగా, మిస్టరీగా ఉంటాయని లక్కీ అన్నారు. వృత్తిగత జీవితాన్ని బహిర్గతం చేయకుండా శిక్షణ పొందామని, తాను దానికే కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.
News November 18, 2024
అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు: నారా రోహిత్
తన తండ్రి మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన వేళ అండగా నిలిచిన అందరికీ హీరో నారా రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ముఖ్యంగా ఈ కష్టకాలంలో మాలో ధైర్యాన్ని నింపిన పెదనాన్న(చంద్రబాబు), పెద్దమ్మ(భువనేశ్వరి), లోకేశ్ అన్నయ్య, బ్రాహ్మణి వదినకు ప్రత్యేకంగా ధన్యవాదాలు’ అని చెప్పారు. కాగా రోహిత్ తండ్రి, సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే.