News October 5, 2024

బాధ్యతలు చేపట్టిన కార్పొరేషన్ ఛైర్మన్లు

image

AP: రాష్ట్రంలో వివిధ సంస్థల ఛైర్మన్లు ఇవాళ అమరావతిలో తమ బాధ్యతలు చేపట్టారు. మారిటైమ్ బోర్డు ఛైర్మన్‌-దామచర్ల సత్య, పర్యాటక శాఖ ఛైర్మన్-నూకసాని బాలాజీ, ఏపీఐఐసీ ఛైర్మన్-మంతెన రామరాజు బాధ్యతలు తీసుకున్నారు. వీరికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.

Similar News

News November 6, 2024

అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను కాలేజీల ఖాతాల్లోకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించే ఫైలుపై ఇవాళ క్యాబినెట్ సమావేశంలో చర్చించి, ఆమోదించనుంది. ప్రస్తుత విధానంతో కాలేజీలు విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి చేయడంతో కొందరు పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం దృష్టికి రావడంతో కాలేజీలకే చెల్లించాలని చూస్తోంది.

News November 6, 2024

రామగుండంలో రూ.29,345 కోట్లతో పవర్ ప్రాజెక్టు

image

TG: రామగుండంలో NTPC ఆధ్వర్యంలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. 2400(3*800) మెగావాట్ల సామర్థ్యంతో రూ.29,345 కోట్లతో దీనిని నిర్మించేందుకు NTPC బోర్డు ఆమోదం తెలిపింది. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 6400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో రూ.80,000 కోట్లతో ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి.

News November 6, 2024

12 ఎకరాల స్థలం కొన్న పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో మరో 12 ఎకరాల స్థలం కొన్నారు. ఆయన తరఫున రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ సుధీర్ నిన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలోనే ఇక్కడ పవన్ ఇల్లు, క్యాంప్ కార్యాలయం నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటానని ఆయన ప్రకటించారు. ఇప్పటికే భోగాపురంలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడలో 2.08 ఎకరాలు కొన్నారు.