News November 22, 2024
కాస్కో రేవంత్: బీఆర్ఎస్
TG: లగచర్ల గ్రామస్థుల అరెస్టుకు నిరసనగా తాము <<14666575>>మహబూబాబాద్‌లో<<>> చేపట్టనున్న నిరసనకు హైకోర్టు అనుమతిచ్చిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ‘కాస్కో రేవంత్. నువ్వెన్ని ఆంక్షలు పెట్టినా పేద దళిత, గిరిజన, ఆది వాసీ ప్రజల పక్షాన నిలబడతాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం’ అని పేర్కొంది. ఈనెల 25న ఉ.10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 1000 మందితో ధర్నా చేసుకోవచ్చని బీఆర్ఎస్కు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
Similar News
News November 22, 2024
తేనెకు అందుకే ఎక్స్పైరీ ఉండదు!
ఏ వస్తువుకైనా ఎక్స్పైరీ తేదీని చూసేవారు తేనెకు చూడరు. ఎందుకంటే అది పాడవదు. స్వచ్ఛమైన తేనె దశాబ్దాలైనా పాడవదని పెద్దలు చెప్తుంటారు. ఎందుకో ఆలోచించారా? ‘తేనెలో ఉండే 17శాతం నీరు దీనిని చెడిపోకుండా చేస్తుంది. తక్కువ నీటి శాతం బ్యాక్టీరియాను నిర్జలీకరణం చేస్తుంది. దీంతో చెడిపోదు. ఆమ్లత్వం కూడా 3.9శాతం ఉండటం మరో కారణం. తేమను పీల్చుకునే సామర్థ్యం తేనెకు ఉండటం కూడా ఓ కారణమే’ అని నిపుణులు చెబుతున్నారు.
News November 22, 2024
‘పుష్ప-2’ మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. స్పందించిన మేకర్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మరోసారి వాయిదా పడనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు తెరదించేలా మేకర్స్ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. మూవీలో అల్లు అర్జున్ మేనరిజం వీడియోను షేర్ చేసి ‘డిసెంబర్ 5.. అస్సలు తగ్గేదేలే’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అనుకున్న తేదీకే మూవీ రానున్నట్లు క్లారిటీ వచ్చేసింది. అలాగే USA ప్రీమియర్స్ డిసెంబర్ 4న పడతాయని మేకర్స్ తెలిపారు.
News November 22, 2024
పార్టీ మారిన MLAలపై హైకోర్టు కీలక తీర్పు
TG: పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన MLAలపై అనర్హత వేటు వేయాలని BRS దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. పార్టీ మారిన MLAల విషయంలో తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. 10వ షెడ్యుల్ ప్రకారం అనర్హతపై ఆ నిర్ణయం ఉండాలని సూచించింది. ‘4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి’ అని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా డివిజన్ బెంచ్ కొట్టేసింది.