News November 22, 2024

కాస్కో రేవంత్: బీఆర్ఎస్

image

TG: లగచర్ల గ్రామస్థుల అరెస్టుకు నిరసనగా తాము <<14666575>>మహబూబాబాద్‌లో<<>> చేపట్టనున్న నిరసనకు హైకోర్టు అనుమతిచ్చిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ‘కాస్కో రేవంత్. నువ్వెన్ని ఆంక్షలు పెట్టినా పేద దళిత, గిరిజన, ఆది వాసీ ప్రజల పక్షాన నిలబడతాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం’ అని పేర్కొంది. ఈనెల 25న ఉ.10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 1000 మందితో ధర్నా చేసుకోవచ్చని బీఆర్ఎస్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

Similar News

News December 11, 2024

2 గంటల్లో 12 పెగ్గులేస్తే..

image

యువత, మధ్య వయస్కుల్లో బింగే, హై ఇంటెన్సిటీ డ్రింకింగ్ అలవాటు ప్రమాద ఘంటికలు మోగిస్తోందని డాక్టర్లు అంటున్నారు. 2 గంటల్లోనే 6 పెగ్గులేస్తే బింగే, 10-12 వరకు తాగితే హై ఇంటెన్సిటీ డ్రింకింగ్ అంటారు. సోషల్ ఆబ్లిగేషన్స్, ఫ్రెండ్స్ వల్ల అతిగా మద్యం తాగే అలవాటు పెరుగుతోందని వారు చెప్తున్నారు. దీంతో పాంక్రియాస్, లివర్, స్టొమక్, హార్ట్, మైండ్, నెర్వస్ సిస్టమ్ రోగాలబారిన పడతాయని వార్నింగ్ ఇస్తున్నారు.

News December 11, 2024

అయ్యో.. భవ్యశ్రీ

image

AP: పేదరికం, మూఢనమ్మకం ఓ చిన్నారి ప్రాణాలు తీశాయి. నెల్లూరుకు చెందిన లక్ష్మయ్య, లక్ష్మి కూతురు భవ్యశ్రీ(8) బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతుండగా సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. అలా చేస్తే ఆమె బతకదని పేరెంట్స్ భయపడ్డారు. దానికితోడు డబ్బులూ లేవు. ఆదూరిపల్లి చర్చిలో ప్రార్థనలు చేస్తే నయం అవుతుందని కొందరు చెప్పడంతో 40 రోజులుగా ఉపవాసం ఉంటూ ప్రేయర్స్ చేశారు. చివరికి భవ్యశ్రీ చర్చిలోనే ప్రాణాలు విడిచింది.

News December 11, 2024

‘స్పిరిట్‌’లో ప్రభాస్ లుక్ ఇలాగే ఉంటుందా?

image

సందీప్ రెడ్డి తెరకెక్కించనున్న స్పిరిట్ మూవీలో ప్రభాస్ లుక్స్ ఎలా ఉంటాయన్నదానిపై ఆయన ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ ఫ్యాన్ గ్రోక్ ఏఐను వాడి ప్రభాస్‌ పోలీస్‌ గెటప్‌ను క్రియేట్ చేశారు. ప్రభాస్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఆ పిక్ వైరల్ అవుతోంది. డార్లింగ్ ప్రస్తుతం ది రాజా సాబ్, సలార్ సీక్వెల్, ఫౌజీ సినిమాల్లో నటిస్తున్నారు. వాటి తర్వాతే స్పిరిట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.