News February 8, 2025

ఢిల్లీలో కాంగ్రెస్ ‘జీరో హ్యాట్రిక్’ రికార్డ్ ఇందుకేనేమో?

image

ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నఢిల్లీ, ప్రస్తుతం సున్నాలతో హ్యాట్రిక్ కొట్టింది. 2013లో హస్తం పార్టీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ప్రజలు ఆప్ వైపు మెుగ్గుచూపారు. షీలాదీక్షిత్ తర్వాత మోదీ, కేజ్రీవాల్‌ను ఎదుర్కొనే నాయకుడు దొరకలేదు. కిందిస్థాయి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైంది. వీటితో పాటు ఇండియా కూటమి విభేదాలు పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టినట్లు భావిస్తున్నారు.

Similar News

News March 17, 2025

వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

image

AP: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 28 వరకు ఆయనకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వంశీని కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అంగీకరించింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్‌ విచారణను కోర్టు ఈ నెల 19కు వాయిదా వేసింది.

News March 17, 2025

కొత్త ఏడాది రాశిఫలాలు..

image

ఈ నెల 30న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త ఏడాది పంచాంగంలో రాశుల వారీగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఇలా ఉన్నాయి. కన్య, మిథునం రాశుల వారికి ఆదాయం ఎక్కువ. వీరికి 14 ఆదాయం, వ్యయం 2గా ఉంది. మేషం, వృశ్చికం రాశులవారికి 2మాత్రమే ఆదాయం ఉండగా, వ్యయం మాత్రం 14గా ఉంది. మేష రాశి వారికి అత్యధికంగా అవమానం 7గా ఉంది. కర్కాటకం, కుంభం రాశులవారికి రాజపూజ్యం 7గా ఉంది. మీరూ చెక్ చేసుకోండి.

News March 17, 2025

పోసాని సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి

image

AP: పోసాని కృష్ణమురళికి ఒక రోజు CID కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను రేపు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ప్రెస్‌మీట్‌లో ప్రముఖులను అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై CID కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇదే కేసులో గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అటు మంగళవారం పోసాని బెయిల్ పిటిషన్‌ గుంటూరు కోర్టులో రేపు విచారణకు రానుంది.

error: Content is protected !!