News October 25, 2024
అప్పుడు ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయా: మ్యాక్స్‌వెల్
ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయానని ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెప్పారు. ఆ సమయంలో ఎంతో ఒత్తిడికి గురైనట్లు తన పుస్తకం ‘ది షోమ్యాన్’లో తెలిపారు. ‘ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆసీస్ తరఫున తొలి సిక్స్ బాదా. ఆ తర్వాత పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సారీ చెప్పా. అలాగే 2017 సీజన్‌లో పంజాబ్ కెప్టెన్‌గా ఉండి కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 5, 2024
STOCK MARKET: నిన్న విలవిల.. నేడెలా మొదలయ్యాయంటే
బెంచ్‌మార్క్ సూచీలు నేడూ నష్టాల్లోనే మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే అందినా ఇన్వెస్టర్లు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ 23,943 (-52), సెన్సెక్స్ 78,586 (-198) వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, మెటల్, ఫార్మా షేర్లలో అక్యూములేషన్ కనిపిస్తోంది. FMCG, ఫైనాన్స్, రియాల్టి, OIL & GAS షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. అదానీ పోర్ట్స్, TRENT, శ్రీరామ్ FIN, ITC, HDFC లైఫ్ టాప్ లూజర్స్.
News November 5, 2024
సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని మరోసారి బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ భిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. సల్మాన్‌కు వారు 2 ఆప్షన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఏదైనా గుడికి వెళ్లి దేవుడిని క్షమాపణలు కోరడం లేదా రూ.5 కోట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ వారంలో ఆయన బెదిరింపులు ఎదుర్కోవడం ఇది రెండోసారి.
News November 5, 2024
‘పదకొండు’ సభకు జగన్ వస్తారా?: టీడీపీ శ్రేణులు
AP: ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో టీడీపీ శ్రేణులు వైసీపీ, జగన్‌ను ట్రోల్స్ చేస్తున్నాయి. ‘11వ నెల 11వ తేదిన మొదలై 11 రోజులపాటు జరిగే సమావేశాలకు 11 మంది శాసనసభ్యులు ఉన్న వైసీపీ హాజరవుతుందా? ఆ సభ్యుల్లో ఒకరైన జగన్ వస్తారా?’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలా? వద్దా అనేదానిపై వైసీపీ ఇంకా నిర్ణయించలేదు.