News March 16, 2024

ప్రజా తీర్పునకు కౌంట్‌డౌన్ @79

image

జూన్ 4.. రాజకీయ నేతలకు బిగ్ డే. 79 రోజుల ఉత్కంఠకు ఆరోజున తెరపడనుంది. ఐదేళ్ల ప్రభుత్వ పనితీరుకు ప్రజలు చారిత్రక తీర్పు ఇవ్వనున్నారు. దేశంలోని 96.8 కోట్ల మంది ఓటర్లు నేతల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. సీఎం జగన్ చరిత్ర సృష్టిస్తారా? రాష్ట్ర ప్రజలు మార్పునకే ఓటేశారా? దేశంలో నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధిస్తారా? కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానుందా? అన్న ప్రశ్నలకు ఆ మంగళవారమే సమాధానం లభించనుంది.

Similar News

News November 21, 2024

2 జిల్లాల్లో 100% పూర్తయిన ఇంటింటి సర్వే

image

TG: సమగ్ర ఇంటింటి సర్వే జనగాం, ములుగు జిల్లాల్లో వందశాతం పూర్తయిందని ప్రభుత్వం తెలిపింది. నల్గొండ, కామారెడ్డి, మంచిర్యాల, భువనగిరి, జగిత్యాల, NZB, సిరిసిల్ల, గద్వాల, MBNR, మెదక్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, నారాయణపేట, భూపాలపల్లి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 90 శాతానికి పైగా సర్వే పూర్తయింది. GHMCలో 60.60% లక్ష్యాన్ని అందుకున్నట్లు సర్కార్ వివరించింది.

News November 21, 2024

విరాట్ ఒక సెంచరీ చేస్తే చాలు: పుజారా

image

విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై పరుగుల వరద పారిస్తారని చటేశ్వర్ పూజారా ఓ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. ‘ఒక్క సెంచరీ చేస్తే చాలు విరాట్‌కు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఇక ఆ తర్వాత అతడిని ఎవరూ ఆపలేరు’ అని పేర్కొన్నారు. పుజారా BGT కోసం స్టార్ స్పోర్ట్స్‌లో హిందీ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. కాగా.. విరాట్‌కు ఆస్ట్రేలియాలో అద్భుతమైన రికార్డుంది. అక్కడ జరిగిన 13 మ్యాచుల్లో 1352 రన్స్ చేశారు.

News November 21, 2024

కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు పితృవియోగం

image

AP: నరసాపురం బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సూర్యనారాయణ రాజు (91) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఇవాళ మరణించారు. రేపు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. సూర్యనారాయణ రాజు మృతి పట్ల బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి, ముఖ్య నాయకులు సంతాపం తెలిపారు.