News March 16, 2024
ప్రజా తీర్పునకు కౌంట్‌డౌన్ @79

జూన్ 4.. రాజకీయ నేతలకు బిగ్ డే. 79 రోజుల ఉత్కంఠకు ఆరోజున తెరపడనుంది. ఐదేళ్ల ప్రభుత్వ పనితీరుకు ప్రజలు చారిత్రక తీర్పు ఇవ్వనున్నారు. దేశంలోని 96.8 కోట్ల మంది ఓటర్లు నేతల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. సీఎం జగన్ చరిత్ర సృష్టిస్తారా? రాష్ట్ర ప్రజలు మార్పునకే ఓటేశారా? దేశంలో నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధిస్తారా? కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానుందా? అన్న ప్రశ్నలకు ఆ మంగళవారమే సమాధానం లభించనుంది.
Similar News
News December 9, 2025
ఇతిహాసాలు క్విజ్ – 91 సమాధానం

ఈరోజు ప్రశ్న: శ్రీరాముడి కవల కుమారులే లవకుశులు. మరి రాముడు తన పుత్రులతో యుద్ధమెందుకు చేశాడు?
సమాధానం: శ్రీరాముడు నిర్వహించిన అశ్వమేధ యాగ గుర్రాన్ని వాల్మీకి ఆశ్రమంలో ఉన్న లవకుశులు బంధించారు. అది వారి తండ్రి అశ్వమని వాళ్లకు తెలియదు. అయితే, రాజధర్మాన్ని పాటించాల్సి వచ్చిన రాముడు, గుర్రాన్ని విడిపించడానికి తన సైన్యాన్ని పంపగా, ఆ ఘట్టం చివరకు తండ్రీకొడుకుల మధ్య యుద్ధానికి దారితీసింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 9, 2025
భూసమస్యలకు ఇక JCలదే బాధ్యత: అనగాని

AP: జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ‘గత పాలకుల పాపాలను కడిగేందుకు కృషి చేయడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయాం. అన్ని జిల్లాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే జాయింట్ కలెక్టర్లు పనిచేయాలని CM స్పష్టం చేశారు. JCలు లేని జిల్లాలకు వెంటనే నియమించాలన్నారు. ఇకపై భూసమస్యలన్నింటికీ JCలదే బాధ్యత’ అని తెలిపారు.
News December 9, 2025
మరికొన్ని గంటల్లో బంద్.. నివారణకు ప్రభుత్వం చర్యలు

AP: అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో సరకు రవాణా లారీలు బంద్ పాటించనున్నాయి. దీన్ని ఆపేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. లారీ ఓనర్ల అసోసియేషన్ నేతలతో రవాణాశాఖ కమిషనర్ కాసేపట్లో భేటీ కానున్నారు. బంద్ నిర్ణయాన్ని విరమించాలని కోరనుండగా, దీనిపై నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. 13-20ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్‌నెస్ ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ లారీ యజమానులు బంద్ చేయనున్నారు.


