News June 12, 2024
చైనాకు కౌంటర్.. టిబెట్ ప్రాంతాలకు భారత్ పేర్లు
అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు తమ పేర్లు పెట్టిన చైనాకు భారత్ కౌంటర్ ఇచ్చింది. స్థానిక కల్చర్ ఆధారంగా టిబెట్‌లోని 30 ప్రాంతాలకు ఇండియా కొత్త పేర్లు పెట్టింది. ఇందులో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, 4 నదులు, ఓ సరస్సు, కొంత భూమి, ఒక పర్వత మార్గం ఉన్నాయి. వాటిని LAC మ్యాప్‌లో అప్డేట్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 23, 2024
నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా: నటుడు
అల్లు అర్జున్ కేసుపై పోలీసులు ఇచ్చిన వివరణ తర్వాత నటుడు రాహుల్ రామకృష్ణ Xలో చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘ఇటీవల జరిగిన ఘటనల గురించి నిజంగా నాకు తెలియదు. అందుకే గతంలో చేసిన స్టేట్‌మెంట్స్ వెనక్కి తీసుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. కాగా, లా అండ్ ఆర్డర్ వైఫల్యాన్ని ఓ వ్యక్తి చేసిన తప్పుగా పరిగణించడం సరికాదని ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
News December 23, 2024
STOCK MARKETS: లాభాల్లో పరుగులు..
గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో స్టాక్‌మార్కెట్లు పుంజుకున్నాయి. డాలర్ బలం తగ్గడం, మంచి షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. సెన్సెక్స్ 78,682 (+637), నిఫ్టీ 23,773 (+194) వద్ద ట్రేడవుతున్నాయి. ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు, ఫైనాన్స్ షేర్లకు డిమాండ్ పెరిగింది. SHRIRAMFIN, JSWSTEEL, HDFC BANK టాప్ గెయినర్స్.
News December 23, 2024
అల్లు అర్జున్ పేరు ప్రస్తావించని CM రేవంత్!
TG: నిన్న OU JAC నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఘటన అనంతరం ‘సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా’ అని CM రేవంత్ ట్వీట్ చేశారు. బన్నీ ఇంటిపైనే దాడి జరిగినట్లు స్పష్టమవుతున్నా ఆయన బన్నీ పేరు ప్రస్తావించలేదు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి మాత్రం అర్జున్ పేరుతోనే ట్వీట్ చేశారు. కాగా, అల్లు అర్జున్ పేరును పలికేందుకు CM విముఖత చూపుతున్నారా? దీనిపై మీ COMMENT.