News June 4, 2024

తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం

image

తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 2.18లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన 30నిమిషాల తర్వాత ఈవీఎంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అంటే 8.30గంటలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేస్తారు. అటు పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, 144సెక్షన్ విధించారు.

Similar News

News September 17, 2024

వడ్డీరేటును ఎంత తగ్గిస్తుందో?

image

ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు వేయికళ్లతో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. US ఫెడ్ వడ్డీరేటును ఎంతమేర తగ్గిస్తుందోనని ఆత్రుతగా చూస్తున్నారు. బుధవారం ముగిసే సమావేశాల్లో ఫెడ్ ఛైర్ జెరోమ్ పావెల్ వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తారని రాయిటర్స్ అంచనా వేసింది. కనీసం 25 బేసిస్ పాయింట్ల కోత కచ్చితంగా ఉంటుందని అనలిస్టుల మాట. అదే జరిగితే గ్లోబల్ స్టాక్ మార్కెట్లు రాకెట్లలా దూసుకెళ్లడం ఖాయం.

News September 17, 2024

జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు.. స్పందించిన చిన్మయి

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణలపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ ‘రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడు. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చిన్మయి ట్వీట్ చేశారు. కాగా ఆమె గతంలో రచయిత వైరముత్తు, సింగర్ కార్తీక్‌పై వేధింపుల ఆరోపణలు చేశారు.

News September 17, 2024

మద్యం పాలసీపై అభిప్రాయాలు సేకరిస్తున్న ఎక్సైజ్ శాఖ

image

AP: రాష్ట్రంలో అమలు చేయనున్న కొత్త మద్యం పాలసీపై అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విజయవాడలోని ప్రసాదంపాడులో ఉన్న ఎక్సైజ్ ఆఫీసులో లేదా మంగళగిరి IHC టవర్స్‌లోని పాత సెబ్ ఆఫీసులో రాత పూర్వకంగా అందించవచ్చని లేదా apcommissioner.pe@gmail.comకు ఈమెయిల్ చేయవచ్చన్నారు.