News June 20, 2024

డ్రోన్ల ద్వారా కొరియర్ డెలివరీ!

image

కొరియర్ డెలివరీ సంస్థ బ్లూడార్ట్ దేశవ్యాప్తంగా డ్రోన్ల సేవలను ప్రారంభించింది. దీని కోసం డ్రోన్ టెక్నాలజీ సంస్థ స్కై ఎయిర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఎక్స్ఛేంజీలకు కూడా తెలిపామని చెప్పింది. ఒకరోజులోనే డెలివరీ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ ఓ ప్రకటనలో వివరించింది. 2021లో తెలంగాణలో ఔషధాలను డ్రోన్లద్వారా ప్రయోగాత్మకంగా డెలివరీ చేశామని గుర్తుచేసింది.

Similar News

News September 18, 2024

‘హిరోషిమా’పై జేమ్స్ కామెరూన్ మూవీ?

image

వరల్డ్ వార్-2లో హిరోషిమా, నాగసాకిలపై US అణుబాంబులతో దాడి చేసినప్పుడు జపాన్ ఇంజినీర్ సుటోము యమగుచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన జీవితంపై US రచయిత చార్లెస్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ అనే బుక్ రాశారు. అదే పేరుతో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సినిమా చేస్తారని టాక్. అవతార్ 3, 4, 5 చిత్రాల తర్వాత చేస్తారా? లేక ముందే తీస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

News September 18, 2024

పింఛన్ల పంపిణీపై కీలక నిర్ణయం

image

AP: పింఛన్ పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని పేర్కొంది. రెండో తేదీన మిగిలిన పంపిణీ పూర్తిచేయాలని, ఆ రోజూ సెలవు ఉంటే మూడో తేదీన పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. పంపిణీని ప్రారంభించిన తొలి రోజే దాదాపు 100 శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది.

News September 18, 2024

ఆ ఆదేశాలు ‘హైడ్రా’కు వర్తించవు: రంగనాథ్

image

TG: బుల్డోజర్లతో నేరస్థులు, నిందితుల ఇళ్లను కూల్చడం ఆపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన <<14124312>>ఆదేశాలు<<>> ‘హైడ్రా’కు వర్తించవని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నేరస్థులు, నిందితుల ఆస్తుల జోలికి ‘హైడ్రా’ వెళ్లడం లేదన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను మాత్రమే తాము కూలుస్తున్నామని స్పష్టం చేశారు.