News March 13, 2025

‘కోర్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్

image

మైనర్ అమ్మాయితో ప్రేమ, పోక్సో చట్టం నేపథ్యంలో సాగే సినిమానే ‘కోర్ట్’. విడుదలకు రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. ఫస్టాఫ్‌లో ఎక్కువ భాగం టీనేజ్ ప్రేమ కథను చూపించారు. కుర్రాడిపై కేసు పెట్టాక కథలో వేగం పెరుగుతుంది. సాంగ్స్, బీజీఎం ఆకట్టుకుంటాయి. ఎమోషనల్ సీన్లు హత్తుకుంటాయి. అమ్మాయి మామ పాత్రలో శివాజీ నటన ఈ మూవీకి హైలైట్. కథ ఊహించేలా సాగడం, రొటీన్ లవ్ సీన్లు ఇబ్బంది పెడతాయి.
RATING: 2.75/5

Similar News

News November 19, 2025

మోతే: భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

image

భార్య పద్మను రోకలిబండతో బాది హత్య చేసిన భర్త కారింగుల వెంకన్నను మోతే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. సిరికొండకు చెందిన వెంకన్న, భార్య పద్మపై అనుమానంతో తరుచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఆవేశంలో పద్మను చంపాడు. నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

News November 19, 2025

ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు

image

AP: వచ్చే ఏడాది ఇంటర్ 1st ఇయర్‌ పరీక్షల్లో బుక్‌లెట్ పేజీలను 24నుంచి 32కు పెంచారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్‌కు 32 పేజీలు ఉంటాయి. బయాలజీలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రానికి 24పేజీల చొప్పున 2 బుక్‌లెట్లు ఇస్తారు. భౌతిక, రసాయన, జీవశాస్త్ర పరీక్షలు 85 మార్కులకు పాస్ మార్క్స్ 29. కొన్ని సబ్జెక్టుల్లో 30% వచ్చినా, మొత్తం 35% ఉంటే పాస్‌గా పరిగణిస్తారు.

News November 19, 2025

ఇతిహాసాలు క్విజ్ – 71

image

ఈరోజు ప్రశ్న: గణేశుడు మహాభారతాన్ని రాసేటప్పుడు తన దంతాన్ని ఎందుకు విరిచాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>