News March 13, 2025
‘కోర్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్

మైనర్ అమ్మాయితో ప్రేమ, పోక్సో చట్టం నేపథ్యంలో సాగే సినిమానే ‘కోర్ట్’. విడుదలకు రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. ఫస్టాఫ్‌లో ఎక్కువ భాగం టీనేజ్ ప్రేమ కథను చూపించారు. కుర్రాడిపై కేసు పెట్టాక కథలో వేగం పెరుగుతుంది. సాంగ్స్, బీజీఎం ఆకట్టుకుంటాయి. ఎమోషనల్ సీన్లు హత్తుకుంటాయి. అమ్మాయి మామ పాత్రలో శివాజీ నటన ఈ మూవీకి హైలైట్. కథ ఊహించేలా సాగడం, రొటీన్ లవ్ సీన్లు ఇబ్బంది పెడతాయి.
RATING: 2.75/5
Similar News
News March 18, 2025
ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ

AP: సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి ఒక రోజు సీఐడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని ఈ ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. మరోసారి ఆయన్ను కస్టడీకి కోరే అవకాశం ఉంది.
News March 18, 2025
భార్య, అత్త వేధింపులు.. భర్త ఆత్మహత్య

TG: భార్యల వేధింపులతో తనువు చాలిస్తున్న భర్తల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా HYDలో అబ్దుల్ జమీర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరివేసుకున్నాడు. భార్య, అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని అతను స్నేహితులతో చెప్పుకునేవాడని సమాచారం. అబ్దుల్ సూసైడ్ చేసుకున్న రోజు ఇంట్లో వారిద్దరూ ఉన్నారని, అతను చనిపోయాక అనంతపురానికి వెళ్లారని తెలుస్తోంది. శనివారం ఈ ఘటన జరగగా సోమవారం చెడువాసన రావడంతో విషయం బయటికొచ్చింది.
News March 18, 2025
IPL-2025: తక్కువ జీతమున్న కెప్టెన్ ఇతడే!

మరికొన్ని రోజుల్లో IPL-2025 మొదలుకానుండగా కెప్టెన్ల జీతాలపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇందులో అత్యధికంగా LSG కెప్టెన్ పంత్ రూ.27 కోట్లు జీతం పొందనున్నారు. అలాగే అత్యల్పంగా KKR కెప్టెన్ రహానె రూ.1.5 కోట్లు తీసుకోనున్నారు. పంత్ తర్వాత అయ్యర్(PBKS) రూ.26.75Cr, గైక్వాడ్ (CSK) ₹18 Cr, సంజూ(RR) ₹18Cr, కమిన్స్(SRH) ₹18Cr, అక్షర్(DC) ₹16.50 Cr, గిల్(GT) ₹16.50Cr, పాండ్య(MI) ₹16.35Cr, రజత్(RCB) ₹11Cr.