News May 14, 2024

జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి

image

AP: సీఎం జగన్ విదేశీ పర్యటనకు CBI కోర్టు అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు ఆయన కుటుంబంతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతు సడలించాలని జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వాదనలు విన్న న్యాయమూర్తి ఇటీవల తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ తీర్పు వెలువరించారు.

Similar News

News January 10, 2025

హిందీ జాతీయ భాష కాదు: అశ్విన్

image

టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష అనేది కేవలం అధికార భాష మాత్రమేనని దానికి జాతీయ హోదా లేదని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని ఓ ప్రైవేట్ కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొన్న అశ్విన్ విద్యార్థులతో ముచ్చటిస్తూ ఇలా మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచులకు అశ్విన్ వీడ్కోలు చెప్పారు.

News January 10, 2025

రూ.700 కోట్ల లాభాలు ఎక్కడో కేటీఆర్ చూపాలి: బండి సంజయ్

image

TG: ఈ-కార్ రేస్ కేసులో KTR అరెస్టయితే ఆందోళన అవసరం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆయనేమైనా దేశం కోసం పోరాడారా అని ప్రశ్నించారు. KCR, రేవంత్ కుటుంబాల మధ్య ఏదో ఒప్పందం ఉందని, అందుకే కేసులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. KCR ఫ్యామిలీ అంతా అవినీతిమయమన్నారు. ఈ-కార్ రేసులో ప్రభుత్వానికి రూ.700 కోట్ల లాభాలు ఎక్కడొచ్చాయో చూపించాలని డిమాండ్ చేశారు.

News January 10, 2025

టీమ్ ఇండియా టార్గెట్ 239 రన్స్

image

భారత మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో ఐర్లాండ్ ఓవర్లన్నీ ఆడి 238/7 పరుగులు చేసింది. గాబీ లూయిస్ (92) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. కొద్దిలో శతకం చేజార్చుకున్నారు. లీ పాల్ (59) అర్ధ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు తీశారు. టిటాస్ సాధు, సయాలి, దీప్తీ శర్మ తలో వికెట్ పడగొట్టారు. భారత్ టార్గెట్ 239 పరుగులుగా ఉంది.