News April 8, 2025
జైపూర్ బాంబు పేలుళ్ల నిందితులకు కోర్టు శిక్ష

జైపూర్ (రాజస్థాన్) బాంబు పేలుళ్ల నిందితులకు అక్కడి ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటనలో నిందితులైన షహబాజ్ హుస్సేన్, సర్వర్ అజ్మీ, మహ్మద్ సైఫ్, సైఫుర్ రెహ్మాన్‌లకు జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. 2008 మే13న జైపూర్‌లో 15నిమిషాల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. ఈ ఘటనలో 71 మంది మృతి చెందగా, 180 మందికి పైగా గాయపడ్డారు.
Similar News
News April 17, 2025
అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌కు ఉద్వాసన!

టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌కు BCCI ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత పేలవ ప్రదర్శనకు బాధ్యుడిని చేస్తూ అతడిని తప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఫీల్డింగ్ కోచ్ దిలీప్, ట్రైనర్ సోహమ్ దేశాయ్‌ను కూడా వదిలేస్తున్నట్లు సమాచారం. కాగా అభిషేక్‌ను 7 నెలల క్రితమే బీసీసీఐ అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. స్వల్పకాలంలోనే అతడిని పక్కనబెట్టబోతోంది.
News April 17, 2025
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టులకు నోటిఫికేషన్

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 309 పోస్టులకు గానూ ఏప్రిల్ 25న అప్లికేషన్ ప్రక్రియ మొదలవుతుంది. మే 24వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధింత విభాగంలో బీఎస్సీ, బీటెక్ లేదా బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ <
News April 17, 2025
ఆరు రోజుల పాటు వర్షాలు

TG: ఆవర్తన ద్రోణి వల్ల రాష్ట్రంలో రానున్న 6 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వానలు లేని ప్రాంతాల్లో రాబోయే 3రోజులు 2-3°C ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని పలుచోట్ల వర్షాలు పడతాయంది.