News May 16, 2024

పెళ్లి కానుకలపై కోర్టు కీలక వ్యాఖ్యలు

image

పెళ్లిలో స్వీకరించే కానుకలకు సంబంధించి వధువు, వరుడు లిస్టు మెయింటైన్ చేయాలని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. తద్వారా వరకట్న ఆరోపణలు ఉండవని అభిప్రాయపడింది. వరకట్న నిరోధక చట్టం 1961 సెక్షన్ 3(2) ఇదే చెబుతోందని పేర్కొంది. ఈ చట్టం ప్రకారం వరకట్నం ఇచ్చినా లేక తీసుకున్నా 5ఏళ్ల జైలుతో పాటు ₹15 వేల జరిమానా లేదా కట్నం విలువకు సమాన మొత్తం చెల్లింపు.. ఏది ఎక్కువైతే అది అని తెలిపింది.

Similar News

News January 8, 2025

APPLY NOW.. 600 ఉద్యోగాలు

image

SBI 600 పీఓ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. జనవరి 16 దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ. ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.750 కాగా మిగతావారికి ఉచితం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చే ఏడాది మార్చి 8-15 వరకు జరగనుంది. మెయిన్స్ ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది. వెబ్‌సైట్: <>sbi.co.in <<>>

News January 8, 2025

తెలివి తక్కువ వాళ్లు తల్లి కాకూడదా?: హైకోర్టు

image

తెలివి తక్కువ వాళ్లు తల్లి కాకూడదా అని బొంబాయి హైకోర్టు ప్రశ్నించింది. అలాంటివారికి తల్లి అయ్యే హక్కు లేదని చెప్పడం సరికాదని పేర్కొంది. తన కుమార్తెకు 21 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని ఓ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు పెళ్లి కూడా కాలేదని, మానసిక స్థితి బాగాలేదని తెలిపారు. మరోవైపు ఆమె తల్లి అయ్యేందుకు మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నారని వైద్యులు కోర్టుకు తెలిపారు.

News January 8, 2025

BREAKING: ఫలితాలు విడుదల

image

తెలంగాణ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ఫలితాలను TGPSC విడుదల చేసింది. ఎంపికైన 171 మంది అభ్యర్థుల జాబితాను వెబ్‌సైటులో అందుబాటులో ఉంచింది. 2023 జులైలో TPBO ఉద్యోగాలకు రాత పరీక్ష జరగ్గా, అక్టోబర్ నుంచి డిసెంబర్ 23 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించింది. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.