News December 28, 2024

విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం పోరుబాట

image

AP: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంపై రాష్ట్రవ్యాప్తంగా నిన్న YCP ఆందోళనలు చేపట్టగా సీపీఎం కూడా పోరు బాటపట్టేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల 7, 10 తేదీల్లో విజయవాడ, కర్నూలులో ధర్నాలు, భోగి మంటల్లో ఛార్జీల పెంపు జీవోలను దహనం చేస్తామని ప్రకటించింది. మరోవైపు ఫిబ్రవరి 1-4 తేదీల్లో నెల్లూరు జిల్లాలో సీపీఎం రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తామని నేతలు తెలిపారు.

Similar News

News November 10, 2025

సివిల్స్‌లో పెరగని మహిళల భాగస్వామ్యం

image

సివిల్స్‌లో మహిళల భాగస్వామ్యం పెరగడం లేదు. పురుషులతో పోలిస్తే వారు 40% కూడా పోటీలో ఉండడం లేదని UPSC నివేదిక పేర్కొంటోంది. ప్రిలిమ్స్‌లో 2010లో మొత్తం 2,80,901కి గాను ఫీమేల్ 65,738(23.40%) ఉన్నారు. అదే 2021లో 5,10,438 మందికి గాను 1,68,352(32.98%) స్త్రీలు రాశారు. వీరిలో మెయిన్స్‌కు 14.75% మాత్రమే అర్హత సాధించారు. సామాజిక, ఆర్థిక, భద్రతా సమస్యలు, కుటుంబ సహకారం లేమే ఇందుకు కారణాలని విశ్లేషించింది.

News November 10, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* తిరుపతి(D)లో రాయలచెరువు కట్ట తెగి నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 960 కుటుంబాలకు రూ.3వేల చొప్పున, మరణించిన 1,100 పశువులకు రూ.2.95 కోట్ల పరిహారం ఇవ్వనుంది.
* తిరుమల పరకామణి చోరీ కేసులో భాగంగా అప్పటి తిరుమల వన్‌టౌన్ పోలీసులు, TTD VGOగా పనిచేసిన గిరిధర్‌ను ఇవాళ CID విచారించింది.
* విశాఖ CII సమ్మిట్‌లో 400+ ఒప్పందాలు జరుగుతాయి. ₹లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి: విశాఖ MP శ్రీభరత్

News November 10, 2025

జడ్జిలపై ఆరోపణల ట్రెండ్ పెరుగుతోంది: సీజేఐ

image

ఒక పక్షానికి అనుకూలంగా ఆదేశాలివ్వకపోతే జడ్జిపై ఆరోపణలు చేసే ట్రెండ్ పెరుగుతోందని సుప్రీంకోర్టు CJI గవాయ్ అన్నారు. TG హైకోర్టు జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన N.పెద్దిరాజు కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. రాజు చెప్పిన క్షమాపణలను జడ్జి అంగీకరించారని అడ్వకేట్ సంజయ్ హెగ్డే తెలిపారు. దీంతో విచారణను ముగిస్తున్నట్లు CJI ప్రకటించారు.