News December 28, 2024
విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం పోరుబాట
AP: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంపై రాష్ట్రవ్యాప్తంగా నిన్న YCP ఆందోళనలు చేపట్టగా సీపీఎం కూడా పోరు బాటపట్టేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల 7, 10 తేదీల్లో విజయవాడ, కర్నూలులో ధర్నాలు, భోగి మంటల్లో ఛార్జీల పెంపు జీవోలను దహనం చేస్తామని ప్రకటించింది. మరోవైపు ఫిబ్రవరి 1-4 తేదీల్లో నెల్లూరు జిల్లాలో సీపీఎం రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తామని నేతలు తెలిపారు.
Similar News
News January 17, 2025
కొత్త రూల్.. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే..
సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కొత్త సిమ్ కార్డుల జారీపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కచ్చితమని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ తదితర ప్రభుత్వ ఐడీలు ఉంటే కొత్త సిమ్ ఇచ్చేవారు. కానీ తాజా నిబంధన ప్రకారం ఇక నుంచి ఆధార్ వెరిఫై చేయించాల్సిందే. అంటే ఆధార్ లేనిదే సిమ్ కార్డు ఇవ్వరు.
SHARE IT
News January 17, 2025
రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకం మొదలెట్టాడు: KTR
TGలో ఇచ్చిన హామీలు అమలు చేయని CM రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకం మొదలెట్టారని KTR విమర్శించారు. ఆయన వ్యవహారం తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉందని ట్వీట్ చేశారు. ‘ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ, నెలకు ₹2500, తులం బంగారం, రైతు భరోసా ఎవరికి ఇచ్చారు? ₹5లక్షల విద్యాభరోసా ఎక్కడ? ఇక్కడి హామీలకే దిక్కు లేదు.. <<15169364>>ఢిల్లీలో హామీలకు గ్యారంటీ<<>> ఇస్తున్నావా?’ అని ప్రశ్నించారు.
News January 17, 2025
రేపటి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం
AP: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. టీ-5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో భావర్ కంపెనీ దీన్ని నిర్మించనుంది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణం పూర్తయ్యాక ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుంది. కాగా 2016లోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారు. 2020 తర్వాత వరదలకు కొంత భాగం కొట్టుకుపోయింది.