News September 9, 2024
పటేల్ విగ్రహానికి పగుళ్లు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం భారీ వర్షాలకు కూలిపోవడంతో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కీ పగుళ్లు వచ్చాయని కొందరు పోస్టులు చేస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పగుళ్లు వచ్చాయని, ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఫొటోలు షేర్ చేయగా PIB FACTCHECK స్పందించింది. ఈ సమాచారం ఫేక్ అని, ఈ ఫొటోలు 2018లో నిర్మాణంలో ఉన్నప్పుడు తీసినవని క్లారిటీ ఇచ్చింది.
Similar News
News October 4, 2024
సురేఖ వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ ఏమందంటే?
TG: సినీ నటి సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారని, లేదంటే దీనిపై తీవ్రంగా స్పందించే వాళ్లమని రాష్ట్ర మహిళా కమిషన్ తెలిపింది. మంత్రి వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించామని, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఓ ప్రకటనలో తెలిపింది. సురేఖకు అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులిచ్చే అంశం పూర్తిగా వారి వ్యక్తిగతమని పేర్కొంది.
News October 4, 2024
లడ్డూ వివాదంపై సుప్రీంలో నేడు విచారణ
తిరుమల లడ్డూ వివాదంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. నిన్ననే విచారణ జరగాల్సి ఉండగా సొలిసిటర్ జనరల్ తుషార్ అభ్యర్థన మేరకు ఇవాళ ఉదయం 10.30 గంటలకు వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. సిట్ దర్యాప్తును కొనసాగించాలా? లేదా స్వతంత్ర సంస్థలకు అప్పగించాలా? అనేది నేడు న్యాయమూర్తులు తేల్చనున్నారు.
News October 4, 2024
అమరావతి మీదుగా NH-16 విస్తరణ: పెమ్మసాని
AP: కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే NH-16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. వినుకొండ-గుంటూరు 2 లైన్ల మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించి మరో 25KM పొడిగించారన్నారు. ఇది రాజధాని అమరావతిని తాకేలా రూపొందిందని, దీనివల్ల ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దీన్ని పూర్తిగా NHAI నిర్మిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, విద్యుత్ పనులు చేపడుతుందని తెలిపారు.