News November 27, 2024

పుష్ప-2 మూవీ నుంచి క్రేజీ న్యూస్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ సెన్సార్ పూర్తైనట్లు తెలుస్తోంది. కొన్ని బీప్స్‌తో సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. సినిమాలో జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ ఫైట్, పుష్ప-శ్రీవల్లి మధ్య ఎమోషన్ సీన్లు అదిరిపోయాయంటూ సినీ వర్గాలు సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ సృష్టిస్తున్నాయి. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది.

Similar News

News December 8, 2024

తెలుగు టైటాన్స్ ఖాతాలో మరో విజయం

image

ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ ఖాతాలో మరో విజయం చేరింది. బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచులో 34-32 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. తెలుగు టైటాన్స్‌లో విజయ్ 11 పాయింట్లు సాధించారు. ఈ గెలుపుతో TT ఖాతాలో 10 విజయాలు చేరాయి. దీంతో నాలుగో స్థానానికి చేరింది.

News December 8, 2024

ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడిపై వీగిన అభిశంస‌న‌

image

ద‌క్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై అక్క‌డి పార్టీలు జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన అభిశంస‌న తీర్మానం వీగిపోయింది. అధ్య‌క్షుడి సైనిక పాల‌న నిర్ణ‌యాన్ని వ్యతిరేకిస్తూ ఆయన్ను తొలగించేందుకు అధికార పీపుల్స్ ప‌వ‌ర్ పార్టీ (PPP), విపక్ష డెమోక్రటిక్ పార్టీ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే శ‌నివారం ఓటింగ్ సంద‌ర్భంగా PPP స‌భ్యులు అనూహ్యంగా బాయ్‌కాట్ చేయ‌డంతో తీర్మానం వీగిపోయింది.

News December 7, 2024

అర్ధరాత్రి వరకు నిద్ర పోవట్లేదా?

image

రాత్రి సమయంలో లేటుగా పడుకొని ఉదయాన్నే నిద్ర లేచేందుకు ఇబ్బందులు పడేవారిలో గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉందని ఓ సర్వేలో తేలింది. త్వరగా పడుకొని తెల్లవారుజామున లేచే వారితో పోలిస్తే అర్ధరాత్రి ఆలస్యంగా నిద్రించే వారికి డయాబెటిస్ రిస్క్ ఎక్కువని పేర్కొంది. అర్ధరాత్రి వరకు మేల్కొనే వాళ్లు వీకెండ్ నిద్రతో ఆ లోటును భర్తీ చేయాలనుకోవడం ఆరోగ్య సమస్యలకు కారణమని అధ్యయనాల్లో తేలింది.