News April 28, 2024
ప్రభాస్ ‘కల్కి’ గురించి క్రేజీ రూమర్?
నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ నటిస్తున్న ‘కల్కి 2898AD’ మూవీ గురించి ఓ క్రేజీ వార్త వైరల్ అవుతోంది. నిన్న విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్ లుక్, గతంలో విడుదల చేసిన లుక్ వేర్వేరుగా ఉన్నాయి. దీంతో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని కొందరు, భిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తున్నారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Similar News
News November 5, 2024
ఈ రికార్డు కోహ్లీకి తప్ప ఇంకెవ్వరికీ లేదు
ప్రపంచ క్రికెట్లో మరెవ్వరికీ లేని అరుదైన రికార్డు విరాట్ కోహ్లీకి మాత్రమే సొంతం. కెరీర్లో 168 సిరీసుల్లో 538 మ్యాచులు ఆడిన అతడు 21సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (POTS)గా ఎంపికయ్యారు. టెస్టుల్లో 3, వన్డేల్లో 11, టీ20ల్లో 7 సార్లు ఈ అవార్డు గెలుచుకున్నారు. సచిన్ 183 సిరీసుల్లో 20 POTSతో రెండో ప్లేస్‌లో ఉన్నారు. ప్రపంచ క్రికెట్లో మారిన డైనమిక్స్‌తో ఈ కోహ్లీ రికార్డును ఇంకెవరైనా బద్దలు కొట్టగలరా?
News November 5, 2024
కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?
TG: ‘ఫార్ములా ఈ కార్’ రేసింగ్ అంశం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లను KTR ఓ విదేశీ సంస్థకు బదిలీ చేయించారని ED అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పురపాలకశాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ కూడా ఈడీతో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే మంత్రి పొంగులేటి దీపావళి బాంబ్ అని టాక్.
News November 5, 2024
దారుణం.. బాలిక తొడ కొరికిన టీచర్
AP: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మూడో తరగతి బాలిక తొడపై కొరికి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ దారుణ ఘటన కృష్ణా(D) నరసింహపురంలో జరిగింది. చిన్నారి ఏడుస్తూ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు వేణుగోపాలరావును అరెస్టు చేసినట్లు సమాచారం.