News February 13, 2025
అమరావతి పనులకు CRDA టైమ్ టేబుల్

AP: అమరావతికి మూడేళ్లలో ఓ రూపు తీసుకొచ్చేందుకు CRDA టైమ్ టేబుల్‌తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉగాదికి CRDA మెయిన్ ఆఫీస్ సిద్ధం కానుండగా, రెండున్నరేళ్లలో ఐకానిక్ భవనాలు పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకుంది. రాజధాని నిర్మాణానికి రూ.31వేల కోట్లు రుణంగా తీసుకోవాలని CRDA నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రపంచ బ్యాంక్, ADBల నుంచి రూ.15వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11వేల కోట్లు మంజూరైన విషయం తెలిసిందే.
Similar News
News July 6, 2025
పట్టు బిగించిన భారత్.. మరో 7 వికెట్లు తీస్తే..

ENGతో రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. 608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రాలే(0), డకెట్(25), రూట్(6) ఔటయ్యారు. ఆకాశ్‌దీప్ 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. ఇంగ్లండ్ గెలవాలంటే రేపు ఒక్కరోజే 536 రన్స్ చేయాలి. మరో 7 వికెట్లు తీస్తే టీమ్ ఇండియా గెలుస్తుంది. కాగా రెండో ఇన్నింగ్సులో భారత కెప్టెన్ గిల్ (161) సెంచరీతో మెరిశారు.
News July 6, 2025
ఊపిరి పీల్చుకున్న జపాన్

‘జపాన్ బాబా వాంగా’ <<16947282>>ర్యొ టట్సుకి<<>> జోస్యం చెప్పినట్లుగా ఇవాళ (జులై 5) జపాన్‌లో ఎలాంటి ప్రళయం సంభవించలేదు. అక్కడ 6వ తేదీ రావడంతో ఆ దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ దేశంలో చిన్న భూకంపాలు తప్ప ఎలాంటి సునామీ రాలేదు. దీంతో టట్సుకి భవిష్యవాణి నిరాధారమైందని అక్కడి మేధావులు, సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. కాగా ర్యొ టట్సుకి జోస్యంతో జపాన్‌లో ప్రళయం వస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది.
News July 6, 2025
ఆ సమయంలో 9 రోజులు అన్నం ముట్టను: హీరోయిన్

తాను ఏడాదికి రెండు సార్లు ఉపవాసం ఉంటానని హీరోయిన్ నర్గీస్ ఫక్రీ తెలిపారు. ఆ సమయంలో 9 రోజులపాటు ఏమీ తిననని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఉపవాసం చేసినన్ని రోజులు నీళ్లు తాగే బతుకుతా. ఫాస్టింగ్ అయిపోయేసరికి ముఖం వికృతంగా మారుతుంది. కానీ ముఖంలో కాస్త గ్లో ఉంటుంది. ఉపవాసం అయిపోయాక హై ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటా’ అని చెప్పుకొచ్చారు. కాగా నర్గీస్ ఇటీవల విడుదలైన ‘హౌస్‌ఫుల్ 5‘ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.