News September 9, 2024
క్రెడిట్ రాహుల్‌దే.. కానీ ఆయనకు ఇంకా టైముంది: ప్రశాంత్ కిశోర్
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించిన క్రెడిట్ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి దక్కుతుందని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ అన్నారు. ‘ఏ పార్టీ పునరుజ్జీవంలోనైనా అధినేతే కీలకం. PM నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా పరిగణించే స్థాయికి చేరాలంటే రాహుల్ చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. జాతీయ నాయకుడిగా నిరూపించుకోవడానికి ఆయనకు ఇంకా సమయముంది’ అని PK అభిప్రాయపడ్డారు.
Similar News
News October 8, 2024
రేపు డబుల్ ధమాకా
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రేపు అరగంట వ్యవధిలో రెండు మ్యాచులు జరగనున్నాయి. సాయంత్రం 7 గంటలకు భారత పురుషుల జట్టు బంగ్లాదేశ్‌తో రెండో టీ20 మ్యాచులో తలపడనుంది. మరోవైపు సా.7.30 గంటలకు మహిళా టీ20 ప్రపంచ కప్‌లో శ్రీలంకతో టీమ్ ఇండియా ఆడనుంది. సెమీస్ చేరాలంటే మహిళల జట్టుకు ఈ మ్యాచులో గెలుపు చాలా కీలకం. కాగా బంగ్లాతో తొలి టీ20లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
News October 8, 2024
కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు రూ.585 కోట్లు
ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల(ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం) అసెంబ్లీ ఎన్నికలకు రూ.585 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఈసీకి వివరాలను సమర్పించింది. యాడ్స్, మీడియా ప్రచారానికి రూ.410 కోట్లు, ఇతరత్రాలకు మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేసినట్లు తెలిపింది. కాగా కాంగ్రెస్ వద్ద డిపాజిట్ల రూపంలో రూ.170 కోట్లు ఉండగా వివిధ మార్గాల్లో రూ.539.37 కోట్లు వచ్చాయని పేర్కొంది.
News October 8, 2024
జగన్‌కు బీజేపీ ఎమ్మెల్యే సవాల్
AP: వైసీపీ చీఫ్ జగన్‌కు దమ్ముంటే తనపై జమ్మలమడుగులో పోటీ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. స్థానిక వైసీపీ నేతలు తనకు సరితూగరని చెప్పారు. రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి ఇష్టారీతిగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సంక్రాంతి నాటికి రాజోలి జలాశయ నిర్మాణం, టిడ్కో ఇళ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేరుస్తుందన్నారు.