News August 17, 2024
Tటీ20లతో క్రికెట్ సర్వనాశనం: పాక్ మాజీ క్రికెటర్
టీ20 క్రికెట్ వల్ల సంప్రదాయ క్రికెట్ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గంటల తరబడి క్రీజులో నిలబడే టెస్టు క్రికెట్ సర్వనాశనమవుతుందని వాపోయారు. ‘లీగ్ క్రికెట్ వల్ల ఆటగాళ్లకు డబ్బులు వస్తాయి. కానీ ఆటకు మాత్ర తీవ్ర నష్టం చేకూరుతుంది. ఈ విషయంలో టీమ్ ఇండియా లక్కీనే. ఎందుకంటే భారత ప్లేయర్లు ఐపీఎల్ మినహా మరే లీగ్‌లోనూ ఆడరు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 19, 2024
జానీ మాస్టర్‌ది లవ్ జిహాదీనే: కరాటే కళ్యాణి
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై సినీ నటి కరాటే కళ్యాణి మండిపడ్డారు. ‘జానీ మాస్టర్‌ది కచ్చితంగా లవ్ జిహాదీ కేసే. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలి. నిందితుడిగా తేలితే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మతం మారితే పెళ్లి చేసుకుంటాననడం ఏమిటి? బాధితురాలికి అందరూ అండగా నిలవాలి’ అని ఆమె పేర్కొన్నారు.
News September 19, 2024
ఒకప్పుడు టమాటాను విషం అనుకునేవారు!
పలు పాశ్చాత్య దేశాల్లో ఒకప్పుడు టమాటాను విషంగా భావించి భయపడేవారు. అవి తినడం వల్ల చాలామంది కన్నుమూయడమే అందుక్కారణం. మరణ భయంతో దానికి పాయిజన్ యాపిల్ అని పేరు కూడా పెట్టారు. సుమారు 200 ఏళ్ల పాటు ఈ నమ్మకమే ఉండేది. అయితే, ప్రజలు వాడుతున్న ప్యూటర్(pewter) ప్లేట్లలో లెడ్ సారం ప్రమాదకర స్థాయుల్లో ఉంటోందని, టమాటాల్లోని ఆమ్లంతో కలిసి వారి మరణాలకు దారి తీస్తోందని తర్వాత గుర్తించారు.
News September 19, 2024
అఫ్గానిస్థాన్ సంచలనం
వన్డే క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. దక్షిణాఫ్రికాపై తొలి సారి విజయం సాధించింది. యూఏఈలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచి అఫ్గాన్ రికార్డు సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్.. అఫ్గాన్ బౌలర్ల ధాటికి 106 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 107 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ 26 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.