News October 26, 2024

కోహ్లీ, రోహిత్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్!

image

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విఫలమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై పలువురు టీమ్‌ఇండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీరిద్దరూ వెంటనే రిటైర్ కావాలంటూ Xలో ట్రెండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ సీనియర్ ఆటగాళ్లిద్దరూ స్థాయికి తగ్గట్లుగా ఆడట్లేదని, ఇకనైనా యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. NZతో రెండో టెస్టులో రోహిత్ (0, 8), కోహ్లీ (1, 17) తక్కువే స్కోర్లకే వెనుదిరిగారు.

Similar News

News November 4, 2024

దారుణంగా పడిపోయిన AQ.. లాహోర్ ఉక్కిరిబిక్కిరి

image

పాక్‌లోని లాహోర్‌‌లో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. అక్కడ AQI రికార్డ్ స్థాయిలో 1900 దాటింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్థానిక స్కూళ్లకు వారం సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హెచ్చరించారు. మనదేశంలో AQI అత్యధికంగా ఢిల్లీలో 300పైన నమోదవుతుంటుంది.

News November 4, 2024

HDFC బ్యాంక్ ఖాతాదారులకు గమనిక

image

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యూపీఐ లావాదేవీలకు ఈ నెల 5, 23 తేదీల్లో అంతరాయం కలగనుంది. 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు, 23వ తేదీ 12 గంటల నుంచి 3గంటల వరకు సిస్టమ్స్ నిర్వహణ కారణంగా యూపీఐ చెల్లింపులు చేయలేరని ఆ బ్యాంకు తెలిపింది. అలాగే దుకాణదారులు సైతం యూపీఐ సేవలు పొందలేరని పేర్కొంది.

News November 4, 2024

వెలుగులోకి శతాబ్దాల నాటి నగరం!

image

మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో వందల ఏళ్ల పాటు కనిపించకుండా పోయిన మాయా నాగరికతకు చెందిన నగరాన్ని సైంటిస్టులు గుర్తించారు. దీనికి వలేరియానా అని పేరు పెట్టారు. రాజధాని తరహాలో ఉన్న ఈ సిటీలో 6,674 రకాల కట్టడాలను గుర్తించారు. పిరమిడ్లు, కాజ్‌వేలు, డ్యామ్‌లు, బాల్ కోర్ట్, కొండలపై ఇళ్లు ఉన్నాయి. 50 వేల మంది నివసించి ఉండొచ్చని అంటున్నారు. లిడార్ అనే లేసర్ సర్వే ద్వారా దీనిని వెలుగులోకి తీసుకొచ్చారు.