News November 16, 2024
‘థాంక్యూ 2024’ అంటున్న క్రికెట్ ఫ్యాన్స్
‘2024’.. భారత క్రికెట్ అభిమానులకు చాలా స్పెషల్‌గా మారింది. ఎందుకంటే భారత జట్టు ఇదే ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచింది. మొత్తం 26 టీ20 మ్యాచ్‌లు ఆడితే ఏకంగా 24 గెలిచింది. కేవలం రెండింట్లో ఓడింది. ఈ ఏడాది తన చివరి టీ20ని సౌతాఫ్రికాతో ఆడేసింది. మళ్లీ టీ20లు వచ్చే ఏడాదిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమకు టీ20 ఫార్మాట్లో తీపి గుర్తులు ఇచ్చిన ‘2024’కు థాంక్స్ చెబుతున్నారు.
Similar News
News December 5, 2024
OPPO ఫోన్ వాడుతున్నారా?
OPPO స్మార్ట్ ఫోన్లలో టెక్నికల్ ఇష్యూలు వస్తున్నాయని నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన FIND N3 FLIPలో గ్రీన్ లైన్స్ వచ్చి, ఆటోమెటిక్‌గా స్క్రీన్ పగిలిపోయిందని ఓ నెటిజన్ Xలో పోస్ట్ చేశాడు. ఫోన్ కిందపడకుండానే అలా జరగడంతో షాక్ అయ్యానని, సర్వీస్ సెంటర్ వాళ్లు వారంటీ కిందకు రాదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మీకూ ఇలాంటి సమస్యలు వచ్చాయా? కామెంట్ చేయండి.
News December 5, 2024
తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం
భారత మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 100 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో ఆస్ట్రేలియా కాస్త తడబడినా 16.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో AUS 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
News December 5, 2024
మోస్ట్ పాపులర్ స్టార్స్.. శోభిత తర్వాతే సమంత
ఈ ఏడాది IMDBలో ఎక్కువగా వెతికిన స్టార్ల జాబితా విడుదలైంది. శోభిత 5వ స్థానంలో నిలిచారు. చైతూతో పెళ్లి నేపథ్యంలో ఆమె కోసం ఎక్కువగా సెర్చ్ చేయడంతో ఈ ర్యాంక్ దక్కింది. సమంత 8వ ప్లేస్‌లో ఉన్నారు. సిటాడెల్: హనీబన్నీ విడుదల, ఆమె ఇంటర్వ్యూల కోసం అభిమానులు సెర్చ్ చేశారు. టాప్-1లో త్రిప్తి దిమ్రీ, దీపిక 2, ఇషాన్ ఖట్టర్ 3, షారుఖ్ 4, శార్వరీ 6, ఐశ్వర్యరాయ్ 7, ఆలియా 9, ప్రభాస్ 10వ స్థానాల్లో నిలిచారు.