News December 15, 2024
ఆస్ట్రేలియాపై అత్యధిక మ్యాచులు ఆడిన క్రికెటర్లు
క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై అత్యధిక మ్యాచులు ఆడిన రికార్డు భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆయన మొత్తం 110 మ్యాచులు ఆడారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లీ(100), వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డెస్మండ్ హేన్స్ (97), MS ధోనీ (91), వివ్ రిచర్డ్స్ (88) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ <<14874504>>కోహ్లీకి<<>> 100వ మ్యాచ్ కావడం గమనార్హం.
Similar News
News January 25, 2025
నేడు VSR రాజీనామా
AP: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిన్న ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేడు ఉపరాష్ట్రపతితో భేటీ కానున్నారు. ఢిల్లీలో ఈ రోజు ఉ.10.30 గంటలకు ఆయనను కలిసి రాజీనామా లేఖను అందించనున్నారు. కాగా, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని VSR తెలిపారు. తాను ఏ రాజకీయా పార్టీలోనూ చేరబోనని, వ్యవసాయం చేసుకుంటానని ట్వీట్ చేశారు.
News January 25, 2025
ముంబై దాడులు: రాణా అప్పగింతకు US సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
2008 ముంబై దాడుల కేసులో కీలక ముందడుగు పడింది. ప్రధాన సూత్రధారి తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. అతడి అప్పగింతపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను తాజాగా కొట్టేసింది. దీంతో నేరగాళ్ల ఒప్పందం ప్రకారం త్వరలోనే అమెరికా రాణాను భారత్‌కు సరెండర్ చేయనుంది. పాకిస్థాన్ ISI, లష్కరే తోయిబాతో సంబంధాలున్న అతడే ముంబై పేలుళ్ల సూత్రధారి అని గతంలో IND ఆధారాలు సమర్పించింది.
News January 25, 2025
నిన్న థియేటర్లలో రిలీజ్.. వారానికే OTTలోకి!
మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’కి మలయాళంలో పాజిటివ్ టాక్ రావడంతో శుక్రవారం తెలుగులోనూ రిలీజైంది. తాజాగా ఈ మూవీ OTT రైట్స్ దక్కించుకున్న జీ5 జనవరి 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే థియేటర్లలో రిలీజైన వారానికే OTTలోకి వస్తుండటం గమనార్హం. మూవీలో టొవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో ఇప్పటి వరకు రూ.18కోట్లకు పైగా వసూలు చేసింది.