News November 19, 2024

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు కొట్టివేత

image

AP: dy.CM పవన్ కళ్యాణ్‌పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ గుంటూరు జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వాలంటీర్లను కోర్టు విచారించగా.. తమకు సంబంధం లేదని వారు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు కేసును తొలగించింది. కొంత మంది వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులుగా మారారని గతేడాది పవన్ వ్యాఖ్యానించారు. దీనిపై కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా గుంటూరు జిల్లా కోర్టులో కేసు నమోదైంది.

Similar News

News November 17, 2025

రష్యా చమురు కొనుగోళ్లలో భారత్ రెండో స్థానం

image

అక్టోబర్‌లో US సహా పలు దేశాలు రష్యాపై కొత్త ఆంక్షలు విధించాయి. అయితే అంతకుముందే ఆ దేశం నుంచి భారత్ రూ.26వేల కోట్ల విలువైన ముడి చమురు కొనుగోలు చేసినట్లు CREA వెల్లడించింది. అక్టోబర్‌లో రష్యా నుంచి చమురు కొన్న దేశాల్లో చైనా అగ్రస్థానంలో, IND రెండో ప్లేస్‌లో ఉందని తెలిపింది. అయితే ఆంక్షల తర్వాత రిలయన్స్, HPCL, మంగళూరు రిఫైనరీ తదితర సంస్థలు చమురు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేశాయి.

News November 17, 2025

iBOMMAకు ఎందుకంత క్రేజ్?

image

ఇతర పైరసీ వెబ్‌సైట్లలో యాడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీక్షకులు డిస్టర్బ్ అవుతారు. కానీ ఐబొమ్మలో సినిమా చూసేందుకు క్లిక్ చేసినప్పుడు మాత్రమే యాడ్ వస్తుంది. దాన్ని క్లోజ్ చేసి మరోసారి ఓపెన్ చేస్తే ఇక యాడ్స్ కనిపించవు. అలాగే HD ప్రింట్ వస్తుంది కాబట్టి లక్షల మంది ఆ సైట్‌లో సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లను ప్రతి నెలా 30 లక్షల మంది చూస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

News November 17, 2025

బీఎస్సీ నర్సింగ్‌లో అడ్మిషన్లు

image

AP: రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి 4 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విజయవాడలోని NTR హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. APNCET-2025లో 20 పర్సంటైల్ కంటే ఎక్కువ, 85-17 కటాఫ్ స్కోర్ మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. చివరి తేదీ నవంబర్ 18. పూర్తి వివరాలకు <>క్లిక్<<>> చేయండి.