News November 19, 2024
పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు కొట్టివేత
AP: dy.CM పవన్ కళ్యాణ్‌పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ గుంటూరు జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వాలంటీర్లను కోర్టు విచారించగా.. తమకు సంబంధం లేదని వారు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు కేసును తొలగించింది. కొంత మంది వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులుగా మారారని గతేడాది పవన్ వ్యాఖ్యానించారు. దీనిపై కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా గుంటూరు జిల్లా కోర్టులో కేసు నమోదైంది.
Similar News
News December 5, 2024
ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లు
TG: ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మంది ట్రాన్స్‌జెండర్లు ఎంపికయ్యారు. నిన్న హైదరాబాద్ గోషామహల్ మైదానంలో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ లాంటి ఈవెంట్స్ నిర్వహించగా 58 మందిలో 44 మంది పాస్ అయ్యారు. వీరికి త్వరలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అనంతరం సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ మానిటరింగ్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ సేవలకు వినియోగించుకోనున్నారు. వీరికి ప్రత్యేక యూనిఫామ్, స్టైఫండ్ అందిస్తారు.
News December 5, 2024
ఇకపై ప్రతినెలా రెండుసార్లు క్యాబినెట్ భేటీ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశాలను ఇకపై నెలకు రెండుసార్లు(మొదటి, మూడో గురువారం) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు CS నీరభ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. గురువారం ప్రభుత్వ సెలవు ఉంటే శుక్రవారం భేటీ జరగనుంది. సమావేశాలకు 3 రోజుల ముందుగానే అన్ని శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖకు పంపాలని CS సూచించారు. కాగా ఈ నెల 19న రెండో మంత్రివర్గ సమావేశం జరగనుంది.
News December 5, 2024
IND vs AUS: రెండో టెస్టుకు వరుణుడి గండం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్‌లో జరిగే పింక్ బాల్ మ్యాచుకు వరుణుడి ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తర్వాతి నాలుగు రోజుల్లో వాన పడే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. కాగా తొలి టెస్టులో భారత్ గెలిచి సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.