News March 30, 2024
KTRపై క్రిమినల్ కేసు నమోదు

మాజీ మంత్రి కేటీఆర్‌పై బంజారాహిల్స్ PSలో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్‌పై ఆయన అసత్య ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు నిన్న వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును బంజారాహిల్స్ PSకు పంపగా.. IPC 504, 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. CM రేవంత్ రూ.2,500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారని KTR ఆరోపించినట్లు శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
‘వారణాసి’ బడ్జెట్ రూ.1,300 కోట్లు?

రాజమౌళి-మహేశ్‌బాబు కాంబోలో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ బడ్జెట్ దాదాపు ₹1,300Cr ఉండొచ్చని నేషనల్ మీడియా వెల్లడించింది. ఇప్పటివరకు రూపొందిన భారీ బడ్జెట్ భారతీయ చిత్రాల్లో ఇది ఒకటని తెలిపింది. అయితే నితీశ్ తివారి-రణ్వీర్ కపూర్ ‘రామాయణం’, అట్లీ-అల్లు అర్జున్ ‘AA22xA6’ మూవీల బడ్జెట్(₹1500Cr-₹2000Cr రేంజ్) కంటే ఇది తక్కువేనని పేర్కొంది. కాగా బడ్జెట్‌పై వారణాసి మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
News November 22, 2025
దూసుకొస్తున్న అల్పపీడనం.. ఎల్లో అలర్ట్

AP: దక్షిణ అండమాన్ సముద్రం-మలక్కా మధ్య అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 24న వాయుగుండంగా మారి మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
News November 22, 2025
నవజాత శిశువుల్లో మూర్ఛ

సాధారణంగా మూర్ఛ చిన్నవయసులో/ 60ఏళ్లు పైబడిన వారికి ఎక్కువగా వస్తుంటుంది. కానీ కొన్నిసార్లు నవజాత శిశువులకూ మూర్ఛ వస్తుందంటున్నారు నిపుణులు. దీన్నే నియోనాటల్ మూర్ఛ అంటారు. దీనివల్ల భవిష్యత్తులో ఎదుగుదల లోపాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. సాధారణంగా లక్షలో ఒకరిని ప్రభావితం చేస్తాయి. దీని సంకేతాలు సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి చిన్నారి కదలికలు అసాధారణంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


