News March 30, 2024
KTRపై క్రిమినల్ కేసు నమోదు
మాజీ మంత్రి కేటీఆర్‌పై బంజారాహిల్స్ PSలో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్‌పై ఆయన అసత్య ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు నిన్న వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును బంజారాహిల్స్ PSకు పంపగా.. IPC 504, 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. CM రేవంత్ రూ.2,500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారని KTR ఆరోపించినట్లు శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News January 22, 2025
హార్దిక్, నేను మంచి ఫ్రెండ్స్: SKY
హార్దిక్ పాండ్యా, తాను మంచి స్నేహితులం అని సూర్య కుమార్ యాదవ్ అన్నారు. ‘చాలా కాలంగా కలిసి క్రికెట్ ఆడుతున్నాం. గ్రౌండ్‌లోనే కాకుండా బయటా మేము మంచి ఫ్రెండ్స్. IPL ప్రారంభం కాగానే కెప్టెన్సీ అతనికి అప్పగించి కాస్త రిలాక్స్ అవుతా’ అని సూర్య అన్నారు. ఇంగ్లండ్‌తో T20లకు హార్దిక్‌ను కాదని అక్షర్‌ను VCగా నియమించడంతో హార్దిక్, సూర్య మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో SKY స్పందించారు.
News January 22, 2025
కేజ్రీవాల్‌పై బీజేపీ ‘చునావీ హిందూ’ ఎటాక్
రామాయణంలోని ఓ అంశాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ తప్పుగా చెప్పడంపై ఢిల్లీ ఎన్నికల వేళ BJP ఆయనపై ఎటాక్ చేస్తోంది. ‘చునావీ(ఎన్నికల) హిందూ’ అంటూ విమర్శిస్తోంది. ఆయన సనాతన ధర్మాన్ని కించపరిచారని ఢిల్లీ BJP అధ్యక్షుడు V. సచ్‌దేవా మండిపడ్డారు. ఎన్నికలప్పుడే ఆయనకు ఆలయాలపై ప్రేమ పుట్టుకొస్తుందని ఎద్దేవా చేశారు. BJP నేతలు రావణుడిని ఇష్టపడుతున్నారని, వారి స్వభావం అలాంటిదే అని కేజ్రీవాల్ ఎదురుదాడికి దిగారు.
News January 22, 2025
AP & TGలో ఏడాదికి రూ.కోటి సంపాదించేవారు ఎంతంటే?
ఏడాదికి రూ.కోటి సంపాదించే వారు అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్-2024 డేటా ప్రకారం అక్కడ ఏకంగా 1,24,800 మంది కోటికి పైగా సంపాదిస్తున్నారు. అత్యల్పంగా లక్షద్వీప్‌లో కేవలం ఒకరు, లద్దాక్‌లో ముగ్గురు మాత్రమే రూ.1 కోటి అర్జిస్తున్నారు. ఇక ఏపీలో 5,340 మంది ఉండగా తెలంగాణలో 1,260 మంది ఉన్నారు.